
చిన్న వయసులోనే సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఛైల్డ్ ఆర్టిస్ట్ గా రజనీకాంత్, మమ్ముట్టి, శివాజీ గణేషన్ లాంటి స్టార్ హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. బాలనటిగా సుమారు 45 కు పైగా సినిమాల్లో మెరిసి పలు అవార్డులు, ప్రశంసలు అందుకుంది. ఆ పై నటిగానూ ఎంట్రీ ఇచ్చింది. తెలుగు, తమిళంతో పాటు ఇతర దక్షిణాది భాషల్లో వందలాది సినిమాల్లో యాక్ట్ చేసింది. తన అందం, అభినయంతో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది.ముఖ్యంగా తెలుగులో ఎన్నో సూపర్ హి ట్ సినిమాల్లో యాక్ట్ చేసింది. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, మోహన్ బాబు, రాజశేఖర్.. ఇలా హీరోలందరితోనూ బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడి వయసు సుమారు 49 సంవత్సరాలు. అయినా ఇప్పటికీ సహాయక నటిగా బిజీ బిజీగా ఉంటోంది. ఓవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు టీవీ షోస్ లోనూ సందడి చేస్తోంది. మరి ఇంతకీ ఆమె ఎవరో గుర్తు పట్టారా? తను మరెవరో కాదు మీనా. ఇది ఆమె చిన్ననాటి ఫొటో
ఛైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించిన మీనా 13 ఏళ్ల వయసుకే హీరోయిన్‌గా మారింది. కథానాయికగా ఎన్నో సినిమాలు చేసింది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో స్టార్ హీరోయిన్‌గా రాణించింది. ఇప్పటికీ సినిమాలు చేస్తూనే ఉంది. ఇదిలా ఉంటే కొన్నేళ్ల క్రితం మీనా భర్త కన్నుమూశారు. అప్పటి నుంచి సింగిల్ మదర్ గా తన కూతురు పెంపకంలోనే బిజీగా ఉంటోందీ అందాల తార. అందుకే గతంలో కంటే సినిమాలు బాగా తగ్గించేసిందీ అందాల తార. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది. తన కూతురుతో దిగిన ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. అలాగే తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలను కూడా పంచుకుంటుంది.
Actress #Meena pink saree pic.twitter.com/A4tYPLPItC
— Actress Meena FC (@actressmeena26) February 15, 2026
உன்னதான் நெனச்சேன்
உள்ளுக்குள் தவிச்சேன் தூங்காமலே
என் மாமன் மதுர வீரன்
என் மனசுகேத்த சூரன்❤️🎧#meena hits❤️ pic.twitter.com/D1Tzzbqead— 🔥பாண்டியநாட்டுக்காரன் 💥 (@lsmlpoosai) February 17, 2026
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి