
పై ఫొటోను గమనించారా? ఇది త్రో బ్యాక్ ఫొటో అని అందరికీ తెలుస్తుంది. అందులో ఉన్నది డిగ్రీ కాలేజీ అమ్మాయిలు. కళాశాలలో ఏదో ఫంక్షన్ ఉండడంతో ఎంచెక్కా చీరలో ముస్తాబై వచ్చారు. వచ్చాక ఊరుకుంటారా? సరదాగా ఫొటోలు, సెల్ఫీలు తీసుకున్నారు. అలా ఎప్పుడో దిగిన ఫొటో అది. రీసెంట్ గా ఒకరు సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడంతో నెట్టింట బాగా చక్కర్లు కొడుతోంది. కారణమేమిటంటే..ఈ ఫొటోలో ఒక విశేషముంది. ఆ అమ్మాయిల్లో ఒక టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ ఉండడంతో ఈ ఫొటో బాగా వైరల్ అవుతోంది. మరి ఆ ముద్దుగుమ్మ ఎవరో గుర్తు పట్టారా? కెరీర్ ప్రారంభంలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు, నాని వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసి హిట్లు కొట్టిందీ. అందం, అభినయం పరంగానూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే హీరోయిన్ గా ఎక్కువ కాలం కెరీర్ కొనసాగించలేకపోయింది. తెలుగుతో పాటు తమిళ్ లోనూ సహాయక నటి పాత్రలు పోషించినా సక్సెస్ మాత్రం అందుకోలేకపోయింది. దీంతో క్రమంగా సినిమాలకు దూరమైందీ సొగసరి. ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ ఈ బ్యూటీ పేరు తరచూ వినిపిస్తుంటుంది. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండే ఆమె సామాజిక సమస్యలపై తన గళాన్ని వినిపిస్తుంటుంది. ముఖ్యంగా మహిళల సమస్యలపై తన వాయిస్ ను వినిపిస్తుంటుంది.
అన్నట్లు ఈ టాలీవుడ్ హీరోయిన్ ఇప్పుడు రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటోంది. భారతీయ జనతా పార్టీ తరపున 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా కూడా పోటీ చేసింది. అయితే దురదృష్టవశాత్తూ ఓడిపోయింది. అయితే అవసరమైనప్పుడల్లా సోషల్ మీడియా వేదికగా తన వాయిస్ వినిపిస్తుంటుంది. ఆమె మరెవరో కాదు నచ్చావులే హీరోయిన్ మాధవీలత.
మహేశ్ బాబు నటించిన అతిథి సినిమాలో ఓ చిన్న పాత్ర తో వెండితెరకు పరిచయమైంది మాధవీలత. ఆతర్వాత నచ్చావులే, స్నేహితుడా వంటి హిట్ సినిమాల్లో హీరోయిన్ గా చేసింది. కానీ ఆ తర్వాత అవకాశాలు కనుమరుగుకావడంతో రాజకీయాల్లోకి అడుగు పెట్టింది. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండే ఈ అందాల తార తరచూ తన త్రో బ్యాక్ ఫొటోలు షేర్ చేస్తోంది. అలా తాజాగా తన డిగ్రీ కాలేజీ ఫ్రెండ్స్ తో దిగిన ఫొటోను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసింది. బళ్లారిలోని ASM women’s లో చదువుతున్నప్పటి ఫొటోలను పంచుకుంటూ.. ‘ College లోశారీ డే. -అమ్మాయిల కాలేజీ అంటే ఆ మాత్రం ఉంటుంది.. డిగ్రీ చదివే రోజుల్లో అలనాటి జ్ఞాపకాలు’ అంటూ క్రేజీ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటో నెటిజన్లను అమితంగ ఆకట్టుకుటోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.