
పై ఫొటోను గమనించారా? విద్యార్థులందరూ యూనిఫాంలో ఉంటే ఒకడు మాత్రం కలర్ ఫుల్ డ్రెస్ లో పోజులిస్తున్నాడు. మిగతావారికంటే చాలా స్పెషల్ గా కనిపిస్తున్నాడు. మరి ఆ కుర్రాడు ఎవరో గుర్తు పట్టారా? అతను ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరో. కష్టాన్ని నమ్ముకుని స్వయం కృషితో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. కెరీర్ ప్రారంభంలో మాస్ సినిమాలతో దుమ్ము రేపాడు. ఆ తర్వాత లవ్, రొమాంటిక్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్లతోనూ ఆడియెన్స్ ను మెప్పిస్తున్నాడు. కేవలం యాక్టింగ్ తోనే కాదు.. డైరెక్టర్ గానూ, నిర్మాతగానూ సత్తా చాటుతున్నాడు. అయితే సినిమాలతో పాటు తన కామెంట్స్ తోనూ వార్తల్లో నిలుస్తుంటాడీ యంగ్ హీరో. అందుకే కొన్ని సార్లు నెట్టింట విమర్శలు, ట్రోలింగ్ ను కూడా ఎదుర్కొంటున్నాడు. మరి పోలికలను బట్టి ఆ కుర్రాడు ఎవరో చాలామంది గుర్తు పట్టే ఉంటారు. ఐడెంటిఫై చేయడని వాళ్లు డోంట్ వర్రీ. అతనెవరో మేమే చెబుదాం లెండి. హీ ఈజ్ నన్ అదర్ దెన్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్. ఇది అతని స్కూల్ డేస్ నాటి ఫొటో.
2017లో వెళ్లిపోమాకేతో సినిమాతో తెరంగేట్రం చేసాడు విశ్వక్ సేన్. ఆ తర్వాత తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన ఈ నగరానికి ఏమైంది సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఫలక్ నూమా దాస్ మూవీతో దర్శకుడిగానూ సత్తా చాటాడు. ఇక హిట్ : ఫస్ట్ కేస్, పాగల్, ఓరి దేవుడా, అశోక వనంలో అర్జున కల్యాణం, దాస్ కా దమ్కి, గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదారి, మెకానిక్ రాకీ సినిమాలు విశ్వక్ సేన్ కు మంచి పేరు తీసుకొచ్చాయి.
కాగా విశ్వక్ చివరిగా లైలా సినిమాలో నటించాడు. అయితే ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. కంటెంట్ పరంగా విమర్శలు కూడా రావడంతో విశ్వక్ సేన్ బహిరంగంగా క్షమాపణలు కూడా చెప్పాల్సి వచ్చింది. ప్రస్తుతం ఈ యంగ్ హీరో చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. ఫంకీతో పాటు వీఎస్ 13 సినిమాలో నటిస్తున్నాడు విశ్వక్. త్వరలోనే ఈ సినిమాల గురించి పూర్తి వివరాలు తెలియనున్నాయి.
#Laila is now trending at #2 in India on @PrimeVideoIN!
A big thank you to the audience for all the love and support!
🔗: https://t.co/UFSuBN4ZZU#LailaOnPrime pic.twitter.com/dCi9BM9OhB
— VishwakSen (@VishwakSenActor) March 14, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.