Tollywood:ఈ తొర్రి పళ్ల పాపను గుర్తు పట్టారా? టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మెగా హీరోలకు లక్కీ గర్ల్‌

బలమైన సినిమా నేపథ్యం ఉన్న ఫ్యామిలీ నుంచే వచ్చింది. తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ ఛైల్డ్ ఆర్టిస్టుగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఆ తర్వత అనతికాలంలోనే హీరోయిన్ గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా మెగా హీరోలకు ఈ ముద్దుగుమ్మ లక్కీ గర్ల్ గా మారిపోయింది.

Tollywood:ఈ తొర్రి పళ్ల పాపను గుర్తు పట్టారా? టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మెగా హీరోలకు లక్కీ గర్ల్‌
Tollywood Actress

Updated on: Jan 28, 2025 | 8:37 AM

ఛైల్డ్ ఆర్టిస్టుగా నటించి స్టార్ హీరోలు, హీరోయిన్లుగా ఎదిగిన వారు చాలామందే ఉన్నారు. అందులో ఈ ముద్దుగుమ్మ కూడా ఒకరు. తండ్రి దిగ్గజ నటుడు. తల్లి కూడా ప్రముఖ నటినే. దీంతో సినిమా ఇండస్ట్రీలోకి త్వరగానే ఎంట్రీ లభించింది. తండ్రితో కలిసి ఛైల్డ్ ఆర్టిస్టుగా నటించిన ఈ క్యూటీ ఆ తర్వాత హీరోయిన్ గా కూడా సత్తా చాటింది. హీరోయిన్ గా నటిస్తూనే సింగర్ గానూ సత్తా చాటింది. అయితే హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించిన కొత్తలో ఈ ముద్దుగుమ్మకు అదృష్టం కలిసి రాలేదు. చేసిన సినిమాలన్నీ పరాజయం పాలయ్యాయి. దీంతో ఈ అందాల తారకు ఐరన్ లెగ్ అన్న ముద్ర పడిపోయింది. అయితే ఎప్పుడైతే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో కలిసి ఓ సినిమా చేసిందో ఈ ముద్దుగుమ్మ జాతకమే మారిపోయింది. ఆ తర్వాత ఈ బ్యూటీ నటించిన సినిమాలన్నీ హిట్ అయ్యాయి. మధ్యలో లవ్, డేటింగ్, రిలేషన్ షిప్ అంటూ కాస్త గ్యాప్ తీసుకున్నా రీ ఎంట్రీలో దుమ్ము దులుపుతోంది. సెకెండ్ ఇన్నింగ్స్ లో చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్స్ గా నిలిచాయి. మరి ఈ క్యూటీ ఎవరో గుర్తు పట్టారా? తను మరెవరో కాదు లోక నాయకుడు కమల్ హాసన్ గారాల పట్టి శ్రుతి హాసన్. మంగళవారం (జనవరి 28) ఆమె పుట్టిన రోజు. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు, సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు శ్రుతికి బర్త్ డే విషెస్ చెబుతున్నారు. అదే సమయంలో ఈ హీరోయిన్ కు సంబంధించిన చిన్ననాటి ఫొటోలు, వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

వకీల్ సాబ్,  క్రాక్, వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య, సలార్ పార్ట్-1.. ఇలా బ్యాక్ బు బ్యాక్ హిట్స్ తో ఫుల్ జోష్ లో ఉంది శ్రుతి హాసన్. ప్రస్తుతం ఆమె చేతిలో పలు భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. లోకేశ్ కనగరాజ్- రజనీ కాంత్ కాంబోలో వస్తోన్న కూలీ సినిమాలో శ్రుతి హాసన్ నటిస్తోంది. అలాగే విజయ్ సేతుపతి ట్రైన్ మూవీలోనూ హీరోయిన్ గా ఎంపికైంది. ఇక సలార్ పార్ట్ 2లోనూ ఆమె నటించాల్సి ఉంది. దీంతో పాటు మరికొన్ని క్రేజీ ప్రాజెక్టులు శ్రుతి చేతిలో ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

చిన్నప్పుడు తండ్రి కమల్ హాసన్ తో శ్రుతి హాసన్.. వీడియో..

శ్రుతి హాసన్ ఫొటోస్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.