
పై ఫొటోలో కాస్త బొద్దుగా, క్యూట్‌గా కనిపిస్తున్న అమ్మాయిని గుర్తు పట్టారా? ఇప్పుడామె పాన్ ఇండియా హీరోయిన్. తెలుగుతో పాటు హిందీ సినిమాల్లోనూ నటిస్తూ బిజి బిజీగా ఉంటోంది. ప్రస్తుతం మన దేశంలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే నటీమణుల్లో ఈ ముద్దుగుమ్మ కూడా ఒకరు. నెపోటిజం (బంధు ప్రీతి) లాంటి విమర్శలు ఎదుర్కొంటున్నా స్టార్ డైరెక్టర్లు, స్టార్ హీరోలు ఈ అందాల తార తోనే సినిమాలు తీసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. ఈ మధ్యన స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తూనే మరోవైపు లేడీ ఓరియంటెడ్ మూవీస్ లో కూడా యాక్ట్ చేస్తోందీ ముద్దుగుమ్మ. అన్నట్లు ఈ బ్యూటీ భర్త కూడా స్టార్ హీరోనే. పాన్ ఇండియా రేంజ్ లో అతనికి కూడా గుర్తింపు ఉంది. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఉన్న ది బ్యూటిఫుల్ కపుల్స్ లో ఈ జోడీ కూడా ఒకటి. మరి ఈ క్యూటీఎవరో గుర్తు పట్టారా? తను మరెవరో కాదు ఆర్‌ఆర్ఆర్ సినిమాలో సీతమ్మగా మెరిసిన అలియా భట్. శనివారం (మార్చి 15) ఆమె పుట్టిన రోజు. దీంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఈ బ్యూటీకి బర్త్ డే విషెస్ చెబుతున్నారు. అదే సమయంలో అలియాకు సంబంధించిన చిన్ననాటి ఫొటోలు, పలు ఆసక్తికర విషయాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
గతేడాది జిగ్రా అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది అలియా భట్. తెలుగులోనూ ఈ సినిమా రిలీజైంది. అయితే ఆశించిన మేర విజయం సాధించలేదు. కానీ అభినయం పరంగా అలియాకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో పలు కీలక ప్రాజెక్టులు ఉన్నాయి. అల్ఫా సినిమాతో పాటు లవ్ అండ్ వార్ మూవీస్ లోనూ హీరోయిన్ గా నటిస్తోంది అలియా. దీంతో పాటు మరికొన్ని ప్రాజెక్టులు చర్చల్లో ఉన్నాయి.
ఇక సినిమాలతో పాటు తన కూతురు రాహా కపూర్ ఆలనా పాలనాలోనూ బిజి బిజీగా ఉంటోంది అలియా భట్.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి