Tollywoood: ఒకప్పుడు రంజీ క్రికెటర్.. చిరంజీవిని చూసి హీరో అయిపోయాడు.. ఎవరో గుర్తు పట్టారా?

ఈ టాలీవుడ్ హీరో ఒకప్పుడు అండర్-19 రంజీ క్రికెట్ ప్లేయర్. అంబటి రాయుడు, ప్రగ్యాన్ ఓజాల కెప్టెన్సీల రాష్ట్ర జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. అయితే మెగాస్టార్ చిరంజీవిని చూసి నటనపై ఆసక్తి పెంచుకున్నాడు. ఇప్పుడు టాలీవుడ్ లో క్రేజీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

Tollywoood: ఒకప్పుడు రంజీ క్రికెటర్.. చిరంజీవిని చూసి హీరో అయిపోయాడు.. ఎవరో గుర్తు పట్టారా?
Chiranjeevi, Aadi Saikumar

Updated on: Dec 28, 2025 | 2:59 PM

మెగాస్టార్ చిరంజీవి చేతిలో ఉన్న ఈ అబ్బాయి ఎవరో మీరు గుర్తుపట్టారా? ఇప్పుడు ఆ పిల్లాడు తెలుగులో ఫేమస్ హీరో. తండ్రి కూడా స్టార్ నటుడు కావడంతో చిన్నప్పుడే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. మెగాస్టార్ చిరంజీవి స్ఫూర్తితో హీరోగా మారాడు. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నాడు. అందులో మనోడి డ్యాన్స్, ఫైట్స్ కు అందరూ ఫిదా అయ్యారు. రెండో సినిమా కూడా సూపర్ హిట్ గా నిలిచింది. యూత్ లోనూ మంచి క్రేజ్ ఏర్పడింది. ఇక టాలీవుడ్ లో టాప్ హీరో రేంజ్ కు వెళ్తాడని చాలా మంది భావించారు. కానీ అదేమీ జరగలేదు. సినిమా కథల ఎంపికలో తప్పటడుగులు వేశాడు. వరుసగా పరాజయాలు ఎదుర్కొన్నాడు. దాదాపు 15కు పైగా సినిమాలు చేశాడు. కొత్త కొత్త జానర్లను ట్రై చేశాడు. కానీ విజయం మాత్రం అందలేదు. అలాగనీ ఈ హీరో వెనకడుగు వేయలేదు. జయపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నాడు. తన కష్టానికి తగ్గ ప్రతిఫలం ఇప్పుడు లభించింది. చాలా గ్యాప్ తర్వాత ఎట్టకేలకు మళ్లీ ఓ సూపర్ హిట్ అందుకున్నాడీ హ్యాండ్సమ్ హీరో. ఇంతకీ అతనెవరనుకుంటున్నారా? శంభాలా సినిమాతో గ్రేట్ కమ్ బ్యాక్ ఇచ్చిన ఆది సాయి కుమార్.

2011లో ‘ప్రేమ కావాలి’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ఆది సాయికుమార్. మొదటి మూవీతోనే బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నాడు. ఎన్నో అవార్డ్స్ కూడా సొంతం చేసుకున్నాడు. రెండో సినిమా లవ్లీ కూడా హిట్ అయ్యింది. కానీ ఆ తర్వాత వరుసగా ఫ్లాప్ లు పడ్డాయి. నటనా పరంగా ప్రశంసలు అందుకున్నప్పటికీ కమర్షియల్ గా విజయాలు అందుకోలేకపోయాడు ఆది. ఇప్పుడు శంభాలా సినిమాతో ఆ లోటు కూడా తీరిపోయింది. క్రిస్మస కానుకగా వచ్చిన ఈ మిస్టిక్ థ్రిల్లర్ మూవీ సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబడుతోంది. అంతేకాదు.. ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ తో ప్రముఖ నిర్మాతలు, దర్శకులు ఆదితో సినిమాలు తీసేందుకు క్యూ కడుతున్నారు.

ఇవి కూడా చదవండి

శంభాలా థియేటర్లలో హీరో ఆది సాయి కుమార్..

సినిమా ప్రమోషన్లలో ఆది డ్యాన్స్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.