ఈ ఫోటోలో ఉన్న క్యూట్ లిటిల్ ప్రిన్సెస్ ఎవరో గుర్తపట్టారా ? పాన్ ఇండియా లెవల్లో ఎక్కువగానే ఫాలోయింగ్ ఉంది. అతి తక్కువ సమయంలోనే అందం, అభినయంతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు.. బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న అగ్రకథాయికలలో ఈ క్యూటీ ఒకరు. స్టార్ హీరోస్ అందరితో స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ హీరోయిన్ కు యూత్ ప్యాన్స్ ఎక్కువే. మీకోసం మరో చిన్న క్లూ. ఈ బ్యూటీ తండ్రి కూడా నటుడే. హిందీలో అత్యంత ఫేమస్ నటుడి కుమార్తే ఈమె.. గుర్తుపట్టండి. ఈ బుజ్జాయి మరెవరో కాదు.. బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్. ప్రముఖ నటుడు శక్తి కపూర్ కూతురే శ్రద్ధా. టీన్ పట్టి సినిమాతో కెరీర్ ఆరంభించిన ఈమె.. ఆషికీ 2 సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత ఏబీసీడీ 2, బాగీ, ఓకే జాను, బాగీ 3 వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ఖాతాలో వేసుకుంది.
అంతేకాదు.. ఈ అమ్మడు తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ప్రభాస్ నటించిన సాహో సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది. ఈ మూవీ ఆశించినంత స్థాయిలో ఆకట్టుకోకపోయింది. కానీ శ్రద్ధా నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఇక ఈ సినిమా తర్వాత తెలుగులో మరే సినిమా చేయలేదు శ్రద్ధా. ప్రస్తుతం ఈ అమ్మడు.. లవ్ రంగాస్ సినిమాలో నటిస్తోంది. గత కొద్ది రోజులుగా ఇండస్ట్రీలో శ్రద్ధా కపూర్ జోరు తగ్గినట్లుగా తెలుస్తోంది. చాలా కాలంగా ఈ అమ్మడుకు సంబంధించిన ఎలాంటి ప్రాజెక్ట్ అప్డేట్స్ రావట్లేదు. అంతేకాకుండా.. అటు సోషల్ మీడియాలోనూ సైలెంట్ అయిన ఇటీవలే తిరిగి యాక్టివ్ అయ్యింది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.