
ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది ఈ హీరోయిన్. బ్యాక్ టూ బ్యాక్ భారీ బడ్జెట్ చిత్రాలతో పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. స్టార్ హీరోల సినిమాల్లోనే కాకుండా లేడీ ఓరియెంటెడ్ ప్రాజెక్టులలో నటిస్తుంది ఈ బ్యూటీ. ఇటీవలే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు మరో పెద్ద ప్రాజెక్టులో నటిస్తుంది. వరుస సినిమాలు చేస్తూ తన సక్సెస్ ఎంజాయ్ చేయలేకపోతున్నానని తెగ బాధపడిపోతుంది. తన ఫ్యాన్స్ అర్థం చేసుకోవాలంటూ నెట్టింట సుధీర్ఘ పోస్ట్ చేసింది. ఇన్నాళ్లు తెలుగులో ఈ మూవీ షూటింగ్ చేసిన ఈ భామ.. ఇప్పుడు విదేశాలకు బయలుదేరింది. టోక్యో పిలుస్తుందంటూ క్రేజీ పిక్ తన ఇన్ స్టా స్టోరీలో షేర్ చేసింది. దీంతో ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోను స్క్రీన్ షాట్ తీసి మరీ నెట్టింట వైరల్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇప్పుడు భారతీయ సినీ పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్లలో ఆమె ఒకరు. ఎవరో గుర్తుపట్టరా ? తనే హీరోయిన్ రష్మిక.
కన్నడ సినీ పరిశ్రమలోకి కిరిక్ పార్టీ మూవీతో అడుగుపెట్టి ఫస్ట్ సినిమాతోనే హిట్ అందుకుంది. ఆ తర్వాత ఛలో అంటూ తెలుగు తెరకు పరిచయమై.. గీతా గోవిందం మూవీతో మరో హిట్ ఖాతాలో వేసుకుంది. ఈ సినిమా ఆమె కెరీర్ కు టర్నింగ్ పాయింట్ అయ్యింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస ఆఫర్స్ అందుకుంటూ తక్కువ సమయంలోనే స్టార్ డమ్ అందుకుంది. ఇక డైరక్టర్ సుకుమార్ తెరకెక్కించిన పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ గా ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఈ మూవీతో రష్మిక క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. దీంతో ఆమెకు హిందీలో ఎక్కువ అవకాశాలు వచ్చాయి.
ఇటీవలే డైరెక్టర్ సందీప్ వంగా రూపొందించిన యానిమల్ చిత్రం రష్మికకు మరింత గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇందులో గీతాంజలి పాత్రలో తన నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఫుల్ జోష్ మీదుంది. పుష్ప 2, యానిమల్ పార్క్, గర్ల్ ఫ్రెండ్ చిత్రాల్లో నటిస్తుంది. అలాగే తమిళం, తెలుగు, హిందీలో మరిన్ని ప్రాజెక్ట్ ఈ బ్యూటీ చేతిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవలే తన భర్తకు ఉండాల్సిన క్వాలిటీస్ చెబుతూ మరోసారి వార్తలలో నిలిచింది రష్మిక. తన భర్త అచ్చం VD లా అంటే వెరీ డేరింగ్ లా ఉండాలంటూ చెప్పుకొచ్చింది. దీంతో వీడి అంటే విజయ్ దేవరకొండ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.