
ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్లు ఫస్ట్ మూవీతోనే ఫుల్ క్రేజ్ సంపాదించుకుంటారు. అందం, అభినయంతో యూత్ ఫేవరెట్‌గా నిలిచిపోతారు. ఆ తర్వాత మాత్రం అంతగా అవకాశాలు రాకపోవడంతో సైలెంట్ అయిపోతారు. కానీ వారి ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గదు. అందులో ఈ నాట్యమయూరి ఒకరు. తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది. ఇప్పుడు సినీ పరిశ్రమలోకి వచ్చిన నవతరం కథానాయిక. ప్రస్తుతం ఈ బ్యూటీకి సంబంధించిన అరుదైన ఫోటో సోషల్ మీడియాలో వైరలవుతుంది. ఇన్నాళ్లు తన నటనతో అలరించిన ఈ ముద్దుగుమ్మ నృత్యకారిణి అని చాలా మందికి తెలియదు. పైన ఫోటోను చూశారు కదా.. ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా ?.. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన బ్యూటీ. ఇంతకీ ఆమె ఎవరంటే.. మ్యాడ్ మూవీ హీరోయిన్ అనంతిక సనీల్ కుమార్. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.
అనంతిక సనీల్ కుమార్. తెలుగులో మ్యాడ్ చిత్రంలో నటించి అలరించింది. ఆ తర్వాత మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు. అంతకు ముందు తెలుగులో 2022లో విడుదలైన రాజమండ్రి రోజ్ మిల్క్ సినిమాలో కనిపించింది. అయితే ఈ సినిమాతో ఆమెకు అంతగా గుర్తింపు రాలేదు. కానీ ఇటీవల సూపర్ హిట్ అయిన మ్యాడ్ మూవీతో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఆ మధ్య జరిగిన లాల్ సలామ్ ఆడియో ఫంక్షన్లో స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది. ఈ సినిమాలో ఆమె విష్ణు విశాల్ సరసన కనిపించింది. ఇప్పుడు ఈ అమ్మాయిని తమ లేటెస్ట్ క్రష్ అని చెప్తున్నారు.. తెలుగు కుర్రాళ్లు.
అనంతిక సనీల్ కుమార్ 2000లో జన్మించింది. విక్రమ్ ప్రభు తెరకెక్కించిన రైడ్ చిత్రంలో కనిపించింది. ఈ సినిమా అంతగా విజయం సాధించకపోవడంతో తమిళంలో ఈ బ్యూటీకి అంతగా గుర్తింపు రాలేదు. మ్యాడ్‌తో అందరి అటెన్షన్ గ్రాబ్ చేసింది. మైత్రి మూవీస్ నిర్మిస్తున్న 8 వసంతాలు అనే ప్రాజెక్ట్‌లో హీరోయిన్‌గా చేస్తోంది అనంతిక. ఈ సినిమాకు ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వం వహిస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.