
సోషల్ మీడియాలో సినీ తారల పర్సనల్ విషయాలు ఎప్పటికప్పుడు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు చాలా మంది హీరోహీరోయిన్లు చిన్ననాటి ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. తాజాగా ఓ హీరోయిన్ లేటేస్ట్ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సెషన్ అవుతుంది. పైన ఫోటోను చూశారు కదా. ఆమె అందం ముందు కాలం ఆగిపోవాల్సిందే.. ఈ బ్యూటీ చిరునవ్వుకు వేల హృదయాలు పడిపోవాల్సిందే. నాలుగు పదుల వయసులోనూ 20 ఏళ్ల అమ్మాయిగా కనిపిస్తుంది. ఇప్పటికీ బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలు చేస్తూ నవతరం కథానాయికలుగా గట్టిపోటీనిస్తుంది. ఎవరో గుర్తుపట్టరా ?.. నలుపు చీరలో నయగరం.. సొగసుల ఉప్పెన… తనే కోలీవుడ్ బ్యూటీ మంజు వారియర్. సౌత్ ఇండస్ట్రీలో అత్యధిక ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరోయిన్లలో మంజు ఒకరు.
1978 సెప్టెంబర్ 10న తమిళనాడులో జన్మించిన మంజు వారియర్.. సినిమాల్లోకి రాకముందు నృత్యకారిణి. 16ఏళ్ల వయసులోనే సాక్ష్యం సినిమాతో మలయాళీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఎక్కువగా మలయాళం సినిమాల్లో నటించింది. సల్లాపం, ఏ పళయుం కదనను, కన్మదం, పత్రం వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. ఉత్తమ నటిగా ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకుంది. ఆ తర్వాత వరుసగా నాలుగు సార్లు ఫిలింఫేర్ ఉత్తమ నటిగా పురస్కారం అందుకుంది.
అంతేకాదు.. గతేడాది సినీరంగంలో యువత మెచ్చిన హీరోయిన్లలో మంజు వారియర్ మొదటి స్థానంలో నిలిచారు. ప్రస్తుతం రజినీకాంత్ నటిస్తున్న కొత్త ప్రాజెక్టులో మంజు వారియర్ నటిస్తుంది. అలాగే తమిళంలో మరిన్ని చిత్రాల్లో నటిస్తున్నట్లుగా తెలుస్తోంది. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే మంజు.. తాజాగా షేర్ చేసిన ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.