
పైన ఫోటోలో కనిపిస్తున్న ఆ చిన్నోడు తమిళ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో. వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ హీరోకు తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది. 15 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో వరుస హిట్ చిత్రాలతో దూసుకుపోతున్నాడు. అతడు నటించిన సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యి సూపర్ హిట్ అయ్యాయి. ఇంతకీ అతడు ఎవరో తెలుసా ?.. తను కోలీవుడ్ హీరో జై. మ్యూజిక్ కంపోజర్ దేవా కజిన్‌గా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన జై.. భగవతి మూవీలో విజయ్ దళపతికి తమ్ముడిగా నటించాడు. మొదటి సినిమాతోనే నటనతో అలరించిన జై.. అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకున్నాడు. 2002లో విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత 2007లో విడుదలైన ‘చెన్నై 600028’ నటుడు జైకి మరింత ప్రాధాన్యతనిచ్చింది. 2008లో విడుదలైన ‘సుబ్రమణ్యపురం’ జై కెరీర్‌ని మార్చిన చిత్రం. జై నటించిన మరో హిట్ చిత్రం ‘గోవా’.
2013లో డైరెక్టర్ అట్లీ తెరకెక్కించిన రాజా రాణి సినిమా జై కెరీర్ మలుపు తిప్పిన సినిమా. ఇందులో సూర్య పాత్రలో సహజమైన నటనతో మెప్పించాడు. తెలుగులోకి డబ్ అయిన ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో జైకు తెలుగులో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. రాజా రాణి తర్వాత తమిళంలో వరుస సినిమాలు చేస్తూ బిజీ అయ్యాడు.
04.11.2002 BAGAVATHI
Completion of 15years in my cinema career,MORE2GO!Culdn’t have been possible without all your support Thanks Everyone. pic.twitter.com/PwgfgYcVX1— Jai (@Actor_Jai) November 4, 2017
ఇటీవల లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన లేడీ ఓరియెంటెడ్ మూవీ అన్నపూరణి చిత్రంలోనూ జై ప్రధాన పాత్ర పోషించాడు. కొన్నాళ్లు జై నటించిన అన్ని చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పరాజయం కావడంతో అతడికి అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో ఇటు ఓటీటీలపై ఫోకస్ పెట్టాడు. వెబ్ సిరీస్ , మూవీస్ చేస్తున్నాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.