Kannappa : కన్నప్ప రిలీజ్ వేళ.. మంచు విష్ణు ఆఫీసులో జీఎస్టీ సోదాలు..

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప. అత్యంత ప్రతిష్టాత్మకంగా మోహన్ బాబు నిర్మించిన ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్, శరత్ కుమార్, మోహన్ లాల్, మోహన్ బాబు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ మూవీపై మరింత హైప్ క్రియేట్ చేసింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది

Kannappa : కన్నప్ప రిలీజ్ వేళ.. మంచు విష్ణు ఆఫీసులో జీఎస్టీ సోదాలు..
Manchu Vishnu

Updated on: Jun 25, 2025 | 7:28 PM

మంచు విష్ణు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ కన్నప్ప.. ఈ నెల 27న గ్రాండ్ గా ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమాలో చాలా మంది స్టార్స్ నటిస్తున్నారు. విడుదల దగ్గర పడటంతో సినిమా యూనిట్ ప్రమోషన్స్ కూడా వేగవంతం చేశారు. ఈ క్రమంలో తాజాగా కన్నప్ప టీమ్ కు షాక్ తగిలింది. హీరో మంచు విష్ణు ఆఫీసులో జీఎస్టీ సోదాలు నిర్వహిస్తున్నారు అధికారులు. కన్నప్ప విడుదల నేపథ్యంలో జీఎస్టీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అయితే జీఎస్టీ తనిఖీల గురించి తనకు ఏమీ తెలియదు అంటున్నారు మంచు విష్ణు. మేం దాచిపెట్టడానికి ఏమీ లేదు,  మేం ఎక్కడెక్కడ అప్పులు చేశామో వారికి తెలుస్తుంది అని మంచు విష్ణు అన్నారు.

కన్నప్ప సినిమా బడ్జెట్‌ వివరాలపై GST అధికారుల ఆరా తీస్తున్నారు అధికారులు. కాగా కన్నప్ప సినిమాను మంచు విష్ణు భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు మోహన్ బాబు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాను ఎక్కువ శాతం విదేశాల్లో చిత్రీకరించారు. అలాగే వీఎఫ్ ఎక్స్ కోసం భారీగానే ఖర్చుపెట్టారు. ఇప్పటికే ప్రమోషన్స్ కూడా భారీగానే నిర్వహించారు.

ఈ చిత్రం హిందూ పురాణాల్లోని శివ భక్తుడైన కన్నప్ప జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతుంది. ఇప్పటికే రెబల్ స్టార్ కృష్ణం రాజు కన్నప్ప సినిమా చేసి సంచలన విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు మంచు విష్ణు మరోసారి కన్నప్ప సినిమాతో పేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాకు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, శరత్ కుమార్, కాజల్ అగర్వాల్, మోహన్ బాబు, బ్రహ్మానందం తదితరులు నటిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి