Nandamuri Balakrishna: నటసింహం కోసం పవర్ఫుల్ విలన్‌ను వెతికే పనిలో గోపీచంద్ మలినేని..

సీనియర్ హీరోలు ఫేస్ చేస్తున్న హీరోయిన్ల కొరత మనం ఎప్పుడు వింటూనే ఉంటాం. క్రాక్‌ మూవీలో హీరోయిన్‌గా శ్రుతి వండిపెట్టిన మాస్ బిరియానీ ఘుమఘుమలు ఇప్పట్లో మరిచిపోయేవా...?

Nandamuri Balakrishna: నటసింహం కోసం పవర్ఫుల్ విలన్‌ను వెతికే పనిలో గోపీచంద్ మలినేని..
Gopichand Malineni

Edited By:

Updated on: Aug 25, 2021 | 9:02 AM

Nandamuri Balakrishna: సీనియర్ హీరోలు ఫేస్ చేస్తున్న హీరోయిన్ల కొరత మనం ఎప్పుడు వింటూనే ఉంటాం. క్రాక్‌ మూవీలో హీరోయిన్‌గా శ్రుతి వండిపెట్టిన మాస్ బిరియానీ ఘుమఘుమలు ఇప్పట్లో మరిచిపోయేవా…? కాదుగా…! అందుకే… మాస్ మహరాజ్‌కి తగ్గ రేంజ్‌లోనే గ్లామర్‌ ఫీస్ట్ పండించిన శ్రుతిని రిపీట్ చేద్దామనుకున్నారు గోపీచంద్ మలినేని. బట్‌… బాలయ్యతో ఆ బిరియానీ కల.. కలగానే మిగిలిపోయింది. ఫైనల్‌గా ప్రగ్యా జైస్వాల్‌తో చిల్‌ అవ్వాల్సి వచ్చింది నందమూరి హీరో. ఫిమేల్ లీడ్ విషయం అలా వుంటే… విలన్ క్యారెక్టర్ దగ్గర కూడా కష్టాలు తప్పడం లేదు నటసింహానికి.  హీరోయిజమ్‌కి దీటుగా విలనిజాన్ని కూడా పవర్‌ఫుల్‌గా డిజైన్ చేసే గోపీ చంద్.. క్రాక్‌లో సముద్రఖనితో మంచి ఔట్‌పుట్‌నే రాబట్టారు. ఈసారి కూడా కోలీవుడ్‌వైపే చూసి… మక్కల్ సెల్వన్ విజయ్‌ సేతుపతిని అప్రోచ్ అయ్యారు. ఇప్పటికే సైరా, ఉప్పెనతో తెలుగు ఆడియన్స్‌కి గ్రాండ్‌గా ఇంట్రడ్యూస్ అయ్యారు విజయ్ సేతుపతి.
కోలీవుడ్‌ కాకుండా.. సౌత్ అండ్ నార్త్… అందరికీ హాట్ ఫేవరిట్ అయిన మక్కల్ సెల్వన్‌… ఇప్పుడు బాగా బిజీ. అందుకే… బాలయ్య ప్రాజెక్ట్‌ కోసం డేట్స్ ఎలాట్ చెయ్యలేనని హ్యాండ్సప్ అయ్యారట. కారణం డేట్సేనా లేక మరోటేదైనా వుందా అనే సందేహాలు కూడా వున్నాయి. సరిగ్గా… ఈ గ్యాప్‌లోనే ఎలర్టయింది ఎన్‌బీకే సేన. మా హీరో సినిమానే రిజెక్ట్ చేస్తావా అంటూ ట్రోలింగ్ షురూ చేశారు. అఖండలో కూడా సంజయ్‌దత్ దాకా ట్రై చేసి.. చివరకు శ్రీకాంత్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది బోయపాటికి. సో… నిన్నమొన్నంతా హీరోయిన్ల వేటలో అలసిపోయిన బాలయ్య సినిమాలకు.. ఇప్పుడు విలన్ లను వెతికే పనిలో ఉన్నారట దర్శకులు

మరిన్ని ఇక్కడ చదవండి : 

Seeti Maar: థియేటర్లలో సీటీ కొట్టే సమయం వచ్చేసింది.. గోపీచంద్‌ కొత్త చిత్రం విడుదల ఎప్పుడంటే.

తనపై వస్తున్న ఫేక్ న్యూస్ లపై స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మంచు వారి అబ్బాయి..:Manchu Manoj Video.

Sridevi Soda Center: సెన్సార్ పూర్తి చేసుకున్న శ్రీదేవి సోడా సెంటర్.. విడుదల ఎప్పుడంటే..