Top Searched Movies 2021: మరి కొద్దీ రోజుల్లో ఈ ఏడాది పూర్తికాబోతుంది. ఈ సంవత్సరంలో కరోనా పెట్టిన కంగారు అంతా ఇంతా కాదు. వెలది మంది ఆసుపత్రులపాలు అయ్యారు, వందలాది మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. చాలా మంది ఇళ్లకే పరిమితం అయ్యారు. ఇలాంటి ఏడాది మళ్ళీ రాకూడదు అంటూ ప్రజలు కోరుకుంటున్నారు. ఇక ఈ ఏడాది ఎక్కువ మంది ఇంటర్ నెట్ తోనే గడిపేశారు. ఇదిలా ఉంటే 2021 లో ఎక్కువ గూగుల్ లో గాలించినా సినిమాల లిస్ట్ లో జై భీమ్ నెంబర్ 1 లో నిలిచింది. సూర్య నటించిన జైభీమ్ సినిమా మంచి విజయాన్ని నమోదు చేసుకున్న విషయం తెలిసిందే.. టీ జే జ్ఞాన్వెల్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ఓటీటీ వేదిక విడుదలైంది. ఈ మూవీలో సూర్య లాయర్ గా నటించాడు. ఈ సినిమా ఆదివాసుల కోసం పోరాడే లాయర్ కథ . ఈ సినిమాను తెలుగు, తమిళ్,మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయగా అన్ని భాషల్లో మంచి విజయాన్ని అందుకుంది. 1993 లో తమిళనాడులో గిరిజన మహిళ తరపున న్యాయం కోసం సీనియర్ అడ్వకేట్ చంద్రు పోరాటం చేశారు. ఇదే కథాంశం తో సినిమా తెరకెక్కింది. అప్పట్లో ఆ మహిళ కోసం చంద్రు చేసిన పోరాటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. ఇదిలా ఉంటే ఈ సినిమా పై రకరకాల వివాదాలు కూడా పుట్టుకొచ్చాయి. వాటితోపాటు అనేక రికార్డులను కూడా క్రియేట్ చేసింది జై భీమ్ ఇక ఈ సినిమా మరో రికార్డ్ ను తన ఖాతలో వేసుకుంది.
2021లో ఎక్కువ మంది జై భీమ్ సినిమా కోసం గూగుల్ లో వెతికారట. ఆ తర్వాత బాలీవుడ్ మూవీ షేర్షా సెకండ్ ప్లేస్ లో ఉంది . సిద్దార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ కలిసి నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. కార్గిల్ యుద్ధంలో కన్నుమూసిన ఆర్మీ కెప్టెన్ విక్రమ్ బాత్రా జీవిత కథ ఆదరంగా ఈ సినిమా తెరకెక్కింది. ఇక దృశ్యం 2 సినిమా కూడా టాప్ లిస్ట్ లో ప్లేస్ దక్కించుకుంది. టాప్ 10లో తొమ్మిదో ప్లేస్ లో దృశ్యం 2 నిలిచింది. థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఓటీటీ వేదికగా విడుదలై మంచి హిట్ సొంతం చేసుకుంది. ఇక టాప్ 10 మూవీస్ లిస్ట్ విషయానికొస్తే.. 1.జై భీమ్, 2. షేర్షా , 3. రాధే, 4. బెల్ బాటమ్, 5. ఏటర్నల్స్, 6. మాస్టర్, 7. సూర్యవంశీ, 8. గాడ్జిల్లా వర్సెస్ కాంగ్, 9. దృశ్యం 2, 10. భుజ్
మరిన్ని ఇక్కడ చదవండి: