Game Changer: గేమ్ ఛేంజర్ సెకండ్ డే కలెక్షన్స్.. బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటిన గ్లోబల్ స్టార్

|

Jan 12, 2025 | 9:43 AM

రామ్ చరణ్, కియారా అద్వానీ, ఎస్‌జె సూర్య మరియు అంజలి నటించిన గేమ్ ఛేంజర్ జనవరి 10న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఎస్ శంకర్ దర్శకత్వం వహించిన గేమ్ ఛేంజర్ బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్ సాధించింది. ఈ చిత్రం మొదటి రోజు భారతదేశంలో రూ. 51.25 కోట్లు వసూలు చేసింది. అలాగే రెండో రోజు కూడా భారీగా వసూల్ చేసింది

Game Changer: గేమ్ ఛేంజర్ సెకండ్ డే కలెక్షన్స్.. బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటిన గ్లోబల్ స్టార్
Game Changer
Follow us on

రామ్ చరణ్ నటించిన ‘గేమ్ ఛేంజర్’ జనవరి 10న విడుదలైంది. ఈ సినిమా కోసం ప్రేక్షకులు కళ్ళు కాయలు కాసేలా ఎదుచూశారు. ఆర్ఆర్ఆర్ లాంటి సినిమా తర్వాత చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.  శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాల మధ్య విడుదలైంది.. సినిమా విడుదలైన తొలిరోజే  సూపర్ హిట్ టాక్ వచ్చింది. అలాగే ఓపినింగ్స్ కూడా ఈ సినిమాకు భారీగానే వచ్చాయి.  బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబట్టింది గేమ్ ఛేంజర్. ఇక ఈ సినిమా రెండో రోజు కూడా జోరు చూపించింది.

జనవరి 10న విడుదలైన ‘గేమ్ ఛేంజర్’ చిత్రం తొలిరోజు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.51 కోట్లు రాబట్టింది. ‘గేమ్ ఛేంజర్’ సినిమా తొలిరోజు ఇంత భారీ వసూళ్లు సాధిస్తుందని ఊహించలేదు. మొత్తంగా రూ. 186కోట్ల గ్రాస్ వసూల్ చేసి ‘గేమ్ ఛేంజర్ బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటింది.. సినిమా రెండో రోజు కలెక్షన్లు కూడా బాగానే రాబట్టింది. దాంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

‘గేమ్ ఛేంజర్’ సినిమా రెండో రోజు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.21.50 కోట్లు  రాబట్టింది. తొలిరోజుతో పోలిస్తే కాస్త తక్కువే. గేమ్‌ ఛేంజర్‌ సినిమా స్పెషల్‌ షో రద్దు చేస్తూ..ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ హోంశాఖ. హైకోర్టు ఆదేశాలతో మార్నింగ్‌ స్పెషల్‌ షో రద్దు చేసింది ఈ ప్రభావం కాస్త సినిమా మీద పడిందనే చెప్పాలి. ఇక ఇప్పుడు సంక్రాంతికి రెండో సినిమా రిలీజ్ అయ్యింది నందమూరి బాలకృష్ణ నటించిన ‘డాకూ మహారాజ్’ జనవరి 12న విడుదలైంది. ఆ సినిమాపై మంచి టాక్ రావడంతో ‘గేమ్ ఛేంజర్’ సినిమా కలెక్షన్ల పై ప్రభావం  పడే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. అయితే వీకెండ్, ఆ తర్వాత సంక్రాంతి సెలవులు రావడంతో సినిమా వసూళ్లు నిలకడగా ఉంటాయని కొందరు భావిస్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.