
బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా పేరు ఇటీవల కాలంలో ఎక్కువగా వార్తల్లో వినిపిస్తుంది. ఈ ముద్దుగుమ్మ త్వరలోనే పెళ్లి పీటలెక్కనుంది. తన ప్రియుడు జహీర్ ఇక్బాల్‌ని ఈ అమ్మడు పెళ్లి చేసుకోనుందని తెలుస్తోంది. దాదాపు రెండేళ్ల పాటు డేటింగ్‌లో ఉన్న వీరిద్దరూ ఇప్పుడు పెళ్లిపీటలు ఎక్కనున్నారని తెలుస్తోంది. ఇద్దరూ రిలేషన్‌షిప్‌లో ఉండటం గురించి తరచుగా బాలీవుడ్ లో వార్తలు వచ్చేవి, అయితే జహీర్ ,సోనాక్షి తమ సంబంధం గురించి ఎప్పుడూ బహిరంగంగా మాట్లాడలేదు. జహీర్ కంటే ముందు కూడా సోనాక్షి ప్రేమలో పడిందని టాక్. ఈ అమ్మడు ముగ్గురి ప్రేమలో పడింది. కానీ చివరకు జహీర్ ను పెళ్లాడుతుందని తెలుస్తోంది.
అర్జున్ కపూర్- సోనాక్షి సిన్హా.. అర్జున్ కపూర్ అమిత్ శర్మ దర్శకత్వం వహించిన ‘తేవర్’ చిత్రంలో హీరోగా నటించాడు. ఈ చిత్రం 2015 సంవత్సరంలో విడుదలైంది. ఆ సమయంలో వారిద్దరూ ఒకరిపై ఒకరు మనసు పారేసుకున్నారని టాక్ వినిపించింది. అయితే, వారి సంబంధం గురించి ఎక్కడా క్లారిటీ రాలేదు. అప్పటికే అర్జున్ కపూర్ మలైకాతో ప్రేమలో ఉన్నాడు. అలాగే ఈ అమ్మడు బంటీ సజ్‌దేవ్ తోనూ ప్రేమలో పడిందని టాక్. సోహైల్ ఖాన్ మాజీ భార్య సీమా సజ్‌దేవ్ సోదరుడు బంటీ సజ్‌దేవ్. ఒకప్పుడు సోనాక్షి , బంటీ డేటింగ్ చేస్తూ వార్తల్లో నిలిచారు. ఈ ఇద్దరూ చాలా కాలం డేటింగ్ చేశారు. కానీ ఆతర్వాత ఏమైందో ఏమోకానీ విడిపోయారు.
ఆదిత్య ష్రాఫ్తోనూ సోనాక్షి ప్రేమాయణం నడిపిందని తెలుస్తోంది. సోనాక్షి ‘దబాంగ్’తో ఎంట్రీ ఇచ్చిన తర్వాతనే ఆదిత్యతో ప్రేమలో పడిందట. వీరి డేటింగ్ జీవితం ఎక్కువ కాలం సాగలేదని, ఆ తర్వాత వారిద్దరూ విడిపోయారని టాక్ వినిపిస్తుంది. ఇక ఇప్పుడు జహీర్ ఇక్బాల్ తో ప్రేమలో ఉంది ఈ చిన్నది. కాగా సోనాక్షి, జహీర్ ఇక్బాల్ వివాహం జూన్ 23 న ముంబైలోని బాస్టియన్ రెస్టారెంట్‌లో జరుగుతుందని తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా, వారి పెళ్లికి సంబంధించిన కార్డ్ కూడా వైరల్ అవుతోంది. దాని ప్రకారం ఈ పెళ్లికి ఎరుపు రంగు దుస్తులు ధరించి రాకుండట. సోనాక్షి, జహీర్ తమ వివాహానికి ఫార్మల్ లేదా పండుగ దుస్తులు ధరించి రావాలని కోరుకుంటున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..