Folk Song: రూ.11 లక్షలతో తీసిన బాసింగ బలాలే సాంగ్.. ఎంత రివెన్యూ వచ్చిందంటే..

ప్రస్తుతం యూట్యూబ్, సోషల్ మీడియాలో ఫోక్ సాంగ్స్ దుమ్మురేపుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా తెలంగాణ పల్లె పాటలకు మంచి రెస్పాన్స్ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈమధ్య కాలంలో ఎక్కువగా సూపర్ హిట్ అయిన పాటలకు కొరియోగ్రాఫర్ అందించి పాపులర్ అయ్యారు శేఖర్ వైరస్. ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన రాను బొంబాయికి రాను అనే పాటకు సైతం శేఖర్ వైరస్ కొరియోగ్రాఫీ అందించాడు.

Folk Song: రూ.11 లక్షలతో తీసిన బాసింగ బలాలే సాంగ్.. ఎంత రివెన్యూ వచ్చిందంటే..
Basinga Balalu Song

Updated on: Jul 16, 2026 | 11:09 AM

రాను బొంబాయికి రాను, బాసింగ బలాలు, మామిడి కోనాల మీద వంటి ఫోక్ సాంగ్స్ యూట్యూబ్ లో దుమ్మరేపుతున్న సంగతి తెలిసిందే. పాటలే కాకుండా వాటిలో చేసిన స్టెప్పులు కూడా అంతే ఫేమస్. ప్రస్తుతం యూట్యూబ్ ను ను షేక్ చేస్తున్న ఈ పాటలకు కొరియోగ్రాఫీ అందించిన పాపులర్ అయ్యారు శేఖర్ వైరస్. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శేఖర్ మాట్లాడుతూ తన కెరీర్, రాబోయే ప్రాజెక్టులు, సినిమా పరిశ్రమలో తన అనుభవాలు, వ్యక్తిగత జీవితం గురించి చెప్పుకొచ్చారు. తనకు పాట బాగుండటమే ముఖ్యమని, డబ్బు గురించి పట్టించుకోనని, మంచి పని చేస్తే అవకాశాలు అవే వస్తాయని ఆయన తెలిపారు. శేఖర్ వైరస్ ఇప్పటివరకు దాదాపు 3000 నుండి 4000 ఫోక్ పాటలకు కొరియోగ్రఫీ అందించినట్లు తెలిపారు. “నాకు అన్నం పెట్టింది జానపద నృత్యాలే,” అని స్పష్టం చేస్తూ, వాటికి అత్యధిక ప్రాధాన్యతనిస్తానని అన్నారు. కొన్నిసార్లు సినిమా పాట షూటింగ్ ఉన్నప్పటికీ, ముందే ఒప్పుకున్న జానపద పాటకు ప్రాధాన్యతనిచ్చి, సినిమా అవకాశాన్ని కూడా వదులుకున్న సందర్భాలు ఉన్నాయని ఆయన తెలిపారు.

ఎక్కువ మంది చదివినవి : Vikram Chiyaan : ఆ హీరోయిన్ దేవత.. చాలా మిస్ అవుతున్నాను.. హీరో విక్రమ్ కామెంట్స్..

అనేక జానపద గీతాలకు కొరియోగ్రఫీ చేసిన శేఖర్ వైరస్‌కు సినిమా అవకాశాలు వెల్లువెత్తాయి. నాని హీరోగా నటించనున్న ది ప్యారడైజ్ చిత్రంలో ఒక పాటకు డ్యాన్స్ దర్శకత్వం వహించబోతున్నట్లు ఆయన తెలిపారు. ఈ ప్రాజెక్ట్ 90% ఖరారైనట్లు, ఇందులోని పాట కూడా జానపద శైలికి దగ్గరగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఇడుపు కాయితం, బలగం దర్శకుడు వేణు రూపొందించనున్న యెల్లమ్మ (DSP సంగీతం) వంటి చిత్రాలకు కూడా ఆయనకు అవకాశం వచ్చిందని వెల్లడించారు. అలాగే, తమిళ హీరో విశాల్ తో కూడా చర్చలు జరిగాయని, హైదరాబాద్ వచ్చినప్పుడు కలుద్దామని ఆయన అసిస్టెంట్ చెప్పినట్లు పేర్కొన్నారు. తన జీవితంలో ఎప్పుడూ కష్టాన్ని చూడలేదని, ప్రతి పనిని ఇష్టంగా చేస్తానని ఆయన తెలిపారు. తాను హోటల్‌లో పనిచేస్తున్నప్పుడు కూడా నృత్యం చేయడాన్ని ఆనందించానని, తనకు ఇది కష్టంగా ఎప్పుడూ అనిపించలేదని వివరించారు. డబ్బులు ఎక్కువైతే నిర్వహణ, మైండ్‌సెట్ మారిపోతాయని, ప్రస్తుతమున్న సంతోషకరమైన జీవితం చాలని ఆయన భావిస్తున్నారు. ఇంటి వద్ద సమయం గడపడం, స్నేహితులతో క్రికెట్ ఆడటం వంటి వాటికి ప్రాధాన్యత ఇస్తారు. సినిమా షూటింగ్‌ల కోసం మూడు నెలలు ఒకే చోట కూర్చోవడం కంటే, జానపద గీతాలపై తన పనిని కొనసాగించడమే తనకు ఇష్టమని స్పష్టం చేశారు.

ఎక్కువ మంది చదివినవి : OTT Cinema : అడవిలో అమ్మాయి మరణం.. ఓటీటీని అల్లాడిస్తున్న థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ చూడొచ్చు..

మల్లెచెట్టు కింద కూర్చున్నా అనే జానపద గీతానికి 200 మంది డ్యాన్సర్లతో ఒక పాటకు దర్శకత్వం వహించినప్పుడు, ఆ పాట జానపద నృత్యానికి ఒక ఉదాహరణగా నిలుస్తుందని ఒక ప్రొడ్యూసర్ ప్రశంసించినట్లు ఆయన గుర్తుచేసుకున్నారు. భవిష్యత్తు ప్రాజెక్టులలో మంగ్లీతో బోనాల పాట, నాగదుర్గతో 3-4 పాటలు ఉన్నాయని తెలిపారు. ముఖ్యంగా, రాము రాథోడ్ తో చేయబోయే ఒక కొత్త పాటపై తనకు ఎంతో నమ్మకం ఉందని, అది 400-500 మిలియన్ వ్యూస్ దాటి భారీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ పాట షూటింగ్ కోసం మైసూరు ప్యాలెస్ చుట్టూ లొకేషన్ పర్మిషన్ల కోసం ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. అలాగే ఇటీవల యూట్యూబ్ లో సూపర్ హిట్ అయిన బాసింగ బలాలు పాటను దాదాపు రూ.11 లక్షలతో తెరకెక్కించామని అన్నారు. అయితే ఈ పాటకు నష్టం ఏమీ రాలేదని.. పెట్టుబడికి మించిన ఆదాయం వచ్చిందని అన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Singer S Janaki : పుట్టింది రేపల్లే పల్లపట్లలో.. పెరిగింది కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో.. జానకమ్మ ప్రస్థానం ఇదే..

బాసింగ బలాలే సాంగ్..

ఎక్కువ మంది చదివినవి : S Janaki: ఆ ఒక్క పాట.. జానకమ్మ స్వరంలో మళ్లీ మళ్లీ వినాలనిపించే మెలోడీ.. అప్పుడు ఇప్పుడు యూత్ ఫేవరేట్ సాంగ్..

Follow Us