
సినిమా పాటలతో పాటు ఫోక్ సాంగ్స్ కూడా విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంటున్నాయి. నిజం చెప్పాలంటే సినిమా సాంగ్స్ కు మించి ఫోక్ సాంగ్స్ పాపులర్ అవుతున్నాయి. ఇప్పటికే కొన్ని సాంగ్స్ కోట్ల కొద్దీ వ్యూస్ సొంతం చేసుకుంటున్నాయి. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు విదేశాల్లోనూ ఈ సాంగ్స్ దుమ్మురేపుతున్నాయి. సోషల్ మీడియాలో షేక్ చేస్తున్న సాంగ్స్ ఎన్నో ఉన్నాయి. అలాగే ఫోక్ సాంగ్స్ ద్వారా చాలా మంది పాపులర్ అయ్యారు. సింగర్స్‌తో పాటు డాన్సర్ కూడా మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు. వారిలో నాగ దుర్గ ఒకరు. ఈ చిన్నదానికి సినిమా హీరోయిన్స్ కు మంచి క్రేజ్ ఉంది. ఈ అమ్మడి సాంగ్స్ యూట్యూబ్ లో మిలియన్ ఫ్యూస్ సొంతం చేసుకుంటూ దూసుకుపోతున్నాయి. డాన్స్ తోనే కాదు చూడచక్కని రూపంతో ఆకట్టుకుంటుంది నాగ దుర్గ. ప్రస్తుతం ఫోక్ సాంగ్స్ తో పాటు పలు ఇంటర్వ్యూల్లోనూ పాల్గొంటుంది ఈ చిన్నది.
కాగా గతంలో ఓ ఇంటర్వ్యూలో నాగ దుర్గ ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఒక ఇంటర్వ్యూలో నాగ దుర్గ మాట్లాడుతూ.. పాటల ఎంపిక విషయంలో తాను చాలా ప్రత్యేకంగా ఉంటానని తెలిపింది. ఒక పాట చేయమని వచ్చినప్పుడు, ముందుగా దాని సాహిత్యాన్ని, అర్థాన్ని పూర్తిగా అర్థం చేసుకుంటానని.. సాహిత్యం బాగుండి, తప్పుగా ఉండకూడదని నేను అనుకుంటా అని తెలిపింది నాగ దుర్గ. తనకు అసౌకర్యంగా అనిపించే పదాలు, డబుల్ మీనింగ్ వచ్చే వాక్యాలు ఉంటే, వాటిని మార్చమని అడుగుతానని, లేదంటే అలాంటి పాటలను పూర్తిగా తిరస్కరిస్తానని స్పష్టం చెప్పుకొచ్చింది. కొన్నిసార్లు తాను నో పాటలు చాలా పెద్ద హిట్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయని, అయినా కూడా తాను ఎటువంటి బాధ లేకుండా సంతోషిస్తానని తెలిపింది. అలాగే రెమ్యూనరేషన్ గురించి మాట్లాడుతూ..
తన కెరీర్ ఆరంభంతో పోలిస్తే ఇప్పుడు తన ఆదాయం పెరిగిందని తెలిపింది. నాగ దుర్గ అనగానే ఒక ప్రత్యేకమైన కాస్ట్యూమ్, జ్యువెలరీ, మేకప్ అవసరమవుతాయని, అందువల్ల రెమ్యూనరేషన్ కూడా దానికి తగ్గట్టుగా ఉంటుందని చెప్పుకొచ్చింది. అయితే, పాట తనకు చాలా నచ్చితే, కొత్త ఛానెల్స్ విషయంలో రెమ్యూనరేషన్ తగ్గించుకోవడానికి కూడా సిద్ధంగా ఉంటానని తెలిపింది.. పాటపై తనకున్న మక్కువ దీనికి కారణమని ఆమె పేర్కొంది. పాటల విజయానికి తాను కేవలం ఒక యాడ్ ఆన్ మాత్రమేనని, పాటలోని సాహిత్యం, సంగీతమే అసలైన హీరో అని తెలిపింది. కొరియోగ్రాఫర్, ప్రొడక్షన్ యూనిట్, సెట్ వంటివన్నీ పాట విజయానికి అదనపు కలుపుదలలే అని ఆమె నొక్కిచెప్పారు. తాను దాదాపు 300కు పైగా ఫోక్ పాటలకు డాన్స్ చేశానని, ఇది తన కెరీర్ లో ఒక రికార్డు అని దుర్గ తెలిపింది.అలాగే తాను కెరీర్ ప్రారంభించినప్పుడు 5 మిలియన్ వ్యూస్ రావడమే గొప్పగా ఉండేదని, ఇప్పుడు 50 మిలియన్ వ్యూస్ కూడా చాలా సులువు అయిపోయాయని తెలిపింది. తాను చేసిన “శుక్రవారం మహాలక్ష్మి” అనే పాట తనకు చాలా ఇష్టమైనదని, అది ఇంకా ఎక్కువ మందికి చేరితే బాగుండునని ఆశాభావం వ్యక్తం చేసింది నాగదుర్గ.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.