
దాస్ కా ధమ్కీ హిట్ తర్వాత విశ్వక్ సేన్ నటిస్తోన్న చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఇందులో నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. డైరెక్టర్ కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో మరో బ్యూటీ అంజలి కీలకపాత్రలో కనిపించనుంది. చాలా కాలం తర్వాత ఈ సినిమాలో విశ్వక్ మరోసారి ఫుల్ మాస్ అవతారంలో కనిపించనున్నారు. ఇప్పటిక విడుదలైన పోస్టర్స్ సినిమాపై ఆసక్తిని కలిగించాయి. ఓవైపు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా మరోవైపు అదే స్థాయిలో ప్రమోషన్స్ కూడా నిర్వహిస్తుంది. ఈ క్రమంలోనే గ్లింప్స్, పోస్టర్స్ రిలీజ్ చేసి సినిమాపై బజ్ క్రియేట్ చేశారు. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు.
మల్లా రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో గ్రాండ్ ఈవెంట్ కండక్ట్ చేసి ఈ పాటను విడుదల చేసింది చిత్రయూనిట్. హీరో విశ్వక్ సేన్, హీరోయిన్ నేహశెట్టితోపాటు.. మిగతా చిత్రయూనిట్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తాజాగా విడుదలైన సాంగ్ ఆకట్టుకుంటుంది. సుట్టంలా సూసి పోకల అంటూ సాగే ఈ పాటలో విశ్వక్, నేహ శెట్టి మధ్య ప్రేమ సన్నివేశాలను చూపించారు.
విశ్వక్ సేన్ ఇన్ స్టా పోస్ట్..
సుట్టంలా సూసి పోకల పాటను శ్రీహర్ష ఇమాని రాయగా.. అనురాగ్ కులకర్ణి పాడారు. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీత అందిస్తున్నారు. మొత్తానికి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఫస్ట్ సింగిల్ సుట్టంలా సూసి పోకల పాట సాంగ్ విజువల్స్ బాగున్నాయి.
విశ్వక్ సేన్ ఇన్ స్టా పోస్ట్..
సుట్టంలా సూసి పోకల సాంగ్ వీడియో..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.