AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కొంచమైనా మానవత్వం ఉండాలి.. చనిపోయిన వ్యక్తి గురించి ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు

బాలీవుడ్ సీనియర్ నటుడు నానా పటేకర్ మృతిపై నటి తనుశ్రీ దత్తా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఆమె ఉపయోగించిన ‘ఈవిల్ డెడ్’ అనే పదాలపై ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ విషాద సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదంటూ తనుశ్రీపై మండిపడింది.

కొంచమైనా మానవత్వం ఉండాలి.. చనిపోయిన వ్యక్తి గురించి ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు
Nana Patekar
Rajeev Rayala
|

Updated on: Oct 09, 2026 | 3:15 PM

Share

బాలీవుడ్‌ ప్రముఖ నటుడు నానా పటేకర్ అక్టోబర్ 8న 75 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఆయన మరణవార్తతో సినీ ప్రముఖులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. అయితే, ఈ సమయంలో నటి తనుశ్రీ దత్తా చేసిన వ్యాఖ్యలు కొత్త వివాదానికి తెరలేపాయి. నానా పటేకర్ మరణంపై ఆమె స్పందించిన తీరు చర్చనీయాంశంగా మారింది. నానా పటేకర్ మరణవార్తపై తనుశ్రీ దత్తా సోషల్ మీడియాలో ఓ వీడియోను షేర్ చేశారు. అందులో ఆమె ఉపయోగించిన ‘ఈవిల్ డెడ్’ అనే పదాలపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ వ్యవహారంపై ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ స్పందిస్తూ తనుశ్రీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. AICWA అధ్యక్షుడు సురేష్ శ్యామలాల్ గుప్తా ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియోను పంచుకున్నారు. ఒక ప్రముఖ నటుడు మరణించిన సమయంలో ఆయన గురించి ఇలాంటి పదాలు ఉపయోగించడం బాధాకరమని, కనీస మానవత్వానికి విరుద్ధమని అసోసియేషన్ అభిప్రాయపడింది.

నానా పటేకర్ సినీ రంగానికి అందించిన సేవలతో పాటు సామాజిక కార్యక్రమాల్లో ఆయన పోషించిన పాత్రను ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేష గుర్తుచేసుకుంది. పద్మశ్రీ పురస్కారం అందుకున్న ఆయన, ‘నామ్ ఫౌండేషన్’ ద్వారా కష్టాల్లో ఉన్న రైతు కుటుంబాలకు సహాయం అందించారని పేర్కొంది. కార్గిల్ యుద్ధ సమయంలో దేశానికి సేవలందించిన విషయాన్ని కూడా ప్రస్తావించింది. దేశం ఓ గొప్ప కళాకారుడిని కోల్పోయిన విషాదంలో ఉన్నప్పుడు ఆయన కుటుంబానికి సానుభూతి తెలియజేయాల్సిన అవసరం ఉందని సంఘం పేర్కొంది. ఇలాంటి సందర్భాల్లో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించాలని, ఏది మాట్లాడాలి, ఎప్పుడు మౌనంగా ఉండాలనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని సూచించింది.

తనుశ్రీ దత్తా తన వీడియోలో లక్నోలో జరగనున్న ఓ కార్యక్రమానికి హాజరుకావాల్సి ఉందని, తాను పనిలో బిజీగా ఉన్నాను అని తెలిపింది.. దీని కూడా కూడా స్పందిస్తూ.. మీ పని మీరు చేసుకోండి.. ఎవరూ మిమ్మల్ని అడగలేదు. మీ కార్యక్రమం లక్నోలో జరిగినా, లండన్‌లో జరిగినా, మీరు దానిపై దృష్టి పెట్టినా పెట్టకపోయినా ఎవరికీ ఆసక్తి లేదు. దేశమంతా నానా పటేకర్ మరణంపై విషాదంలో ఉన్న సమయంలో వ్యక్తిగత కార్యక్రమాల గురించి మాట్లాడటం సరికాదని సంఘం అభ్యంతరం వ్యక్తం చేసింది. నానా పటేకర్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, ఆయన కుటుంబానికి సంఘం తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది అని సురేష్ శ్యామలాల్ గుప్తా అన్నారు. తనుశ్రీ దత్తా, నానా పటేకర్ మధ్య గతంలోనూ వివాదం చోటుచేసుకుంది. 2018లో మీటూ ఉద్యమం సమయంలో, 2008లో ‘హార్న్ ఓకే ప్లీజ్’ సినిమా షూటింగ్ సందర్భంగా నానా పటేకర్ తనను లైంగికంగా వేధించారని తనుశ్రీ ఆరోపించారు. నానా పటేకర్ ఆ ఆరోపణలను ఖండించారు. ఇప్పుడు ఆయన మరణం తర్వాత తనుశ్రీ చేసిన వ్యాఖ్యలు మరోసారి ఆ పాత వివాదాన్ని చర్చలోకి తీసుకొచ్చాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us