Sai Madhav Burra: ‘ప్రతి మాటా ఓ జీవిత సత్యం’.. సాయి మాధవ్ బుర్రా కలం నుంచి జాలువారిన గొప్ప డైలాగ్స్

|

Jul 08, 2022 | 1:00 PM

టాలీవుడ్ ఇప్పుడు ఫుల్ ఫామ్‌లో ఉన్నారు డైలాగ్ రైటర్ సాయి మాధవ్ బుర్రా. అగ్ర కథానాయకుల సినిమాలకు ఆయన సంభాషణలు అందిస్తున్నారు. జోనర్ ఏదైనా ఆయన మార్క్ ఉండాల్సిందే.

Sai Madhav Burra: ప్రతి మాటా ఓ జీవిత సత్యం.. సాయి మాధవ్ బుర్రా కలం నుంచి జాలువారిన గొప్ప డైలాగ్స్
Sai Madhav Burra
Follow us on

Tollywood: టాలీవుడ్‌‌లో ప్రజంట్ బెస్ట్ డైలాగ్ రైటర్ ఎవరంటే తడుముకోకుండా చెప్పే పేరు సాయి మాధవ్ బుర్రా. ఈ జనరేషన్‌లో తివ్రికమ్ తర్వాత ఆ స్థాయి ఉన్న వ్యక్తి ఆయనే అని మరో ఆలోచన లేకుండా చెప్పవచ్చు. సినిమా పోస్టర్‌పై ఆయన పేరు చూసి కూడా మూవీకి వెళ్లేవారు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. పౌరాణికాలు, జానపదాలు, వార్ బేస్డ్ మూవీస్, జీవిత కథలు, పక్కా మాస్ మసాల సినిమాలు.. ఏ జోనర్ అయినా సరే ఆయన పెన్ను పవర్ చూపిస్తారు. జీవితానికి సరిపడా పాఠాన్ని ఒక చిన్న డైలాగ్‌లో చెప్పడం సాయి మాధవ్ స్టైల్. నాటక రంగం నుంచి వచ్చి.. తొలుత సీరియల్స్‌కి పనిచేసి.. నేడు అగ్ర కథానాయకుల సినిమాలకు రాస్తూ దిగ్విజయంగా ముందుకు సాగుతున్నారు సాయు మాధవ్. ప్రజంట్ ఆయన రెమ్యూనరేషన్ సినిమాకు కోటికి పైగానే ఉందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. మళ్లీ..మళ్లీ ఇది రాని రోజు, కృష్ణం వందే జగద్గురం, కంచె(Kanche), ఎన్టీఆర్ బయోపిక్, సావిత్రి బయోపిక్ మహానటి(Mahanati), గౌతమీ పుత్ర శాతకర్ణి, గోపాల.. గోపాల, ఖైదీ నంబర్150,  క్రాక్ సినిమాలు సాయి మాధవ్ బెస్ట్ వర్క్ అని చెప్పవచ్చు. కాగా ఆయన కలం నుంచి జాలువారిన టాప్-10 డైలాగ్స్ ఇప్పుడు చూద్దాం..

  1. బిడ్డ ఆకలి తీరాకే తల్లి ఆకలి మొదలవుతుంది
  2. నువ్వు ఎవరు అని అడిగితే ఏం చేస్తుంటావ్ అని..? నీ నెత్తురు ఏంటి అని కాదు. అలా అడిగేవాడు అసలు మనిషే కాడు
  3. అమ్మ 9 నెలలు కష్టపడితే పుట్టాం అనుకుంటారు కొందరు. కాదు నాన్న పక్కలో 10 నిమిషాలు సుఖపడితే పుట్టాం అనుకుంటారు కొందరు. రెండు నిజాలే. కానీ పురిటినొప్పులు చూసినవాడు మనిషి అవుతాడు. పడక సుఖం చూసినవాడు పశువు అవుతాడు
  4. ఆడవాళ్ల ఏడుపు అందరికీ తెలుస్తుంది. మగాళ్ల ఏడుపు మందు బాటిల్‌కే తెలుస్తుంది
  5. బిడ్డ ఆకలి తీరాకే తల్లి ఆకలి మొదలవుతుంది
  6. ప్రేమ పుట్టడానికి ఒక క్షణం చాలు. కానీ  ప్రేమ చనిపోవడానికి ఒక జీవితం సరిపోదు
  7. మనిషి మతాన్ని బ్రతికిస్తుంటే.. మతం మనిషిని చంపేస్తుంది
  8. చచ్చాక ఏడ్చేవాళ్లు ఉంటే చచ్చినా బ్రతికినట్టే. అదే నీ చావు కోసం వేచి చూసేవాళ్లు ఉంటే బ్రతికినా చచ్చినట్టే
  9. గర్భ గుడిలో వీధి కుక్కు ఉచ్చ పోసినంత మాత్రాన దేవుడు మైల పడడు
  10. సాగులేదని భూమిని అమ్ముకుంటే.. సాకలేదని అమ్మను అమ్ముకున్నట్లే

సినిమా వార్తల కోసం