
చక్కనమ్మ చిక్కినా అందమే. కానీ చూడ చక్కనమ్మ ఇప్పుడు చిక్కిందో లేదో కానీ ఫేస్ మాత్రం మారిపోయింది. దీనికితోడు గత కొంతకాలంగా ఆమె ఆరోగ్యంపై రూమర్లు. దీనికితోడు సమంత అనారోగ్యంతో బాధపడుతున్నారని, అమెరికాలో చికిత్స తీసుకుంటున్నారని, గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. వీటన్నింటికి తోడు ఆమె కొంతకాలంగా సోషల్ మీడియాకు దూరంగా ఉంటోంది. దీంతో అభిమానుల్లో ఆందోళన పెరిగిపోయిన నేపథ్యంలో సామ్ స్పందించింది. తాను ‘మయోసైటిస్’ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు ఆమె తెలిపారు. ‘యశోద’తో త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా డబ్బింగ్ చెబుతున్న ఫొటోను షేర్ చేస్తూ సుదీర్ఘ పోస్ట్ చేశారు. ఆ ఫొటోలో సమంత చేతికి సెలైన్ ఉండడం గమనార్హం. ఒకవైపు చికిత్స తీసుకుంటూనే మరోవైపు సినిమాను పూర్తి చేసేందుకు సామ్ శాయశక్తులా ప్రయత్నిస్తున్నట్లు అర్థమవుతోంది. అసలే సామ్ ముఖంలో తేడాను చూసి కంగారు పడుతున్న ఫ్యాన్స్‌కు మరో షాక్ తగిలినట్టయింది. సామ్ లేటెస్ట్ పోస్ట్‌తో అభిమానుల్లో టెన్షన్ పెరిగిపోయింది. అందరూ ఆమె త్వరగా కోలుకోవాలని విష్ చేస్తున్నారు.
ప్రస్తుతం అనారోగ్యానికి గురైన సామ్‌ను.. ఆమె ఎక్స్ హస్బెండ్ చైతూ ఆస్పత్రికి వెళ్లి పరామర్శించాడని.. ఫోన్ చేసి ధైర్యం చెప్పాడని పలు వార్తలు వస్తున్నాయి. అసలు అలాంటిదేం జరగలేదని కొట్టిపడేసేవారు కూడా ఉన్నారు. దీనిపై చైతూ లేదా సామ్ నుంచి సమాధానం రావాల్సి ఉంది. అక్కినేని కాంపౌండ్ నుంచి హీరోలు.. అఖిల్, సుశాంత్ సమంతకు సోషల్ మీడియా వేదికగా ధైర్యం చెప్పారు. నాగ్ కాస్త పెద్ద తరహాలో సమంతకు కాల్ చేసి.. ఆమె ఆరోగ్య వివరాలు తెలుసుకున్నారన్నది ఇండస్ట్రీ టాక్.
కాగా 2010లో విడుదలైన ‘ఏం మాయ చేశావే’ సినిమాలో నటించినప్పటి నుంచి చైతూ, సామ్‌ల మధ్య పరిచయం పెరిగింది. ఏడేళ్ల పరిచయం ప్రేమగా మారి 2017 అక్టోబర్ 6వ తేదీన గోవాలో హిందు, క్రైస్తవ మత సంప్రదాయాల ప్రకారం ఒక్కటయ్యారు. కొన్నాళ్లు అంతా హ్యాపీగానే సాగింది. ఆ తర్వాత భేదాభిప్రాయాలు తలెత్తి ఇద్దరూ 2021లో డివర్స్ తీసుకున్నారు. ప్రజంట్ సమంత అనారోగ్యం నేపథ్యంలో చైయ్-సామ్ ఫ్యాన్స్ ఎమోషనల్‌గా రెస్పాండ్ అవుతున్నారు. సమంత తన సోషల్ మీడియాలో చైతూతో ఉన్న ఫోటోలు డిలీట్ చేసినప్పటికీ.. చైతూ ఆ పని చేయలేదు. దీంతో ఆ ఫోటోల కింద ప్రజంట్ ఎమోషనల్ కామెంట్స్ పెడుతున్నారు ఈ మాజీ కపుల్ ఫ్యాన్స్. మళ్లీ మీరు ఒక్కటవ్వండి అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. మరీ ఆ దిశగా ఏమైనా జరిగే అవకాశం ఉందా..? కాలమే సమాధానం చెప్పాలి.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.