
ఫ్యాన్స్ చేసిన పనికి తలపట్టుకున్న హీరోయిన్..
ఇటీవల మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన సినిమాల్లో ప్రేమలు ఒకటి. డైరెక్టర్ గిరీష్ ఏడీ దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. కేరళతోపాటు తమిళనాడులోనూ మంచి రెస్పాన్స్ అందుకుంది. దీంతో ఈ చిత్రాన్ని తెలుగులోనూ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రేమలు సినిమా ఊహించని స్థాయిలో వసూల్లు రాబట్టింది. ఇక ఈ సినిమాలో నటించిన హీరోయిన్ మమిత బైజుకు ఒక్కసారిగా ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఒక్క సినిమాతో సౌత్ కుర్రవాళ్ల క్రష్ గా మారిపోయింది. ఎక్కడ చూసిన మమిత ఫోటోస్, వీడియోస్ నెట్టింట వైరలయ్యాయి. ఇక మమితాకు సంబంధించిన త్రోబ్యాక్ పిక్స్, వీడియోస్, డాన్స్ వీడియోస్ నెట్టింట తెగ ట్రెండ్ అయ్యాయి. ఈ సినిమాతో తెలుగు రాష్ట్రాల్లో మమితా పేరు మారుమోగింది.
దీంతో తెలుగులో మమితకు వరుస ఆఫర్స్ రావడం ఖాయమనుకున్నారు అంతా. కానీ ఇప్పటివరకు ఈ బ్యూటీ ఒక్క సినిమా అనౌన్స్ చేయలేదు. కానీ రౌడీ హీరో విజయ్ దేవరకొండ కొత్త ప్రాజెక్టులో ఈ బ్యూటీ ఛాన్స్ కొట్టేసిందని టాక్ నడిచింది. అయితే సినిమా ఆఫర్స్ అప్డేట్స్ అంతగా వినిపించకపోయినా.. మమితాకు సోషల్ మీడియాలో మాత్రం క్రేజ్ రోజు రోజుకి పెరుగుతుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మకు షాకిచ్చారు ఫ్యాన్స్. ఇటీవల చెన్నైలోని షాపింగ్ మాల్ ఓపెనింగ్ కోసం వెళ్లింది మమితా. అక్కడ తమ అభిమాన హీరోయిన్ ను చూసేందుకు ఫ్యాన్స్ భారీగా ఎగబడ్డారు. మమితాను చుట్టుముట్టి ఊపిరి ఆడనివ్వకుండా చేశారు. బాడీగార్డ్స్ సాయంతో ఫ్యాన్స్ గుంపు నుంచి బయటపడింది మమిత. ఇందుకు సంబంధించిన వీడియోస్ వైరలవుతుండగా.. ఇది మమితా ఎరా.. మమితా క్రేజ్ అంటే ఇది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Chellatha Pottu paada paduthuraanga 😭 Mamitha Bhaiju In Chennai VR Mall 💔pic.twitter.com/W7CEyqNey4
— Arun Vijay (@AVinthehousee) June 2, 2024
Mamitha got scared after the rush @ chennai! 🙄🤯 pic.twitter.com/6XHaQfJt5Q
— Kαмαℓ ツ (@KamalOfcl) June 2, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.