Prudhvi Raj Tested Corona Positive : ప్రముఖ నటుడు, ఎస్వీబీసీ ఛానల్ మాజీ ఛైర్మన్ 30 ఇయర్స్ పృథ్వీకి కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తెలిపారు. ఆస్పత్రి నుంచి వీడియో రిలీజ్ చేశారు. గత పది రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నట్లు పృథ్వీ చెప్పారు. అన్ని చోట్ల టెస్టులు చేపించినప్పటికీ నెగటివ్ వచ్చిందని, కానీ డాక్టర్ల సూచన మేరు నిన్న అర్థరాత్రి ఆస్పత్రి క్వారంటైన్ లో జాయిన్ అయినట్లు తెలిపారు. అందరి ఆశీస్సులు, వెంకటేశ్వరస్వామి దయతో త్వరగా కోలుకుంటానని పేర్కొన్నారు.