Fahadh Faasil : అదర్‌ లాంగ్వేజెస్‌లోనూ ఆఫర్లు అందుకుంటూ దూసుకుపోతున్న బన్నీ విలన్..

| Edited By: Anil kumar poka

Aug 23, 2021 | 8:04 AM

కరోనా దెబ్బ అదర్‌ ఇండస్ట్రీస్‌ మీద ఎలా ఉందోగానీ, సినిమా మాత్రం డబుల్‌ జోష్‌తో ఉరకలు వేస్తోంది. ఇప్పటికే షూటింగ్‌లు శరవేగంగా జరుగుతున్నాయి.

Fahadh Faasil : అదర్‌ లాంగ్వేజెస్‌లోనూ ఆఫర్లు అందుకుంటూ దూసుకుపోతున్న బన్నీ విలన్..
Fahadh Faasil
Follow us on

Fahadh Faasil : కరోనా దెబ్బ అదర్‌ ఇండస్ట్రీస్‌ మీద ఎలా ఉందోగానీ, సినిమా మాత్రం డబుల్‌ జోష్‌తో ఉరకలు వేస్తోంది. ఇప్పటికే షూటింగ్‌లు శరవేగంగా జరుగుతున్నాయి. రిలీజులకోసం పెద్ద సినిమాలన్నీ ముహుర్తాలు చూసుకుంటున్నాయి. ఇదిలా ఉంటే కొంతమంది స్టార్స్‌లకు డిమాండ్ కూడా గట్టిగా పెరిగింది. అందులో ఆ స్టార్‌ అయితే మరీ… వరుస అవకాశాలతో ప్యాన్‌ ల్యాడర్‌‌‌ను చకచకా ఎక్కేస్తున్నారు. ఇంతకీ ఎవరా స్టార్ అనుకుంటున్నారా ఆయనే మలయాళ హీరో ఫాహద్‌ ఫాజిల్‌. లాక్‌ డౌన్ టైమ్‌లో ఓటీటీ రిలీజ్‌ లతో వరుస సక్సెస్‌లు సాధించిన ఫాహద్‌.. రీసెంట్‌ టైమ్స్ లో డిజిటల్ సూపర్‌ స్టార్‌గా ఎలివేట్‌ అయ్యారు. డిజిటల్ రిలీజ్‌‌‌‌ల కారణంగా అదర్‌ లాంగ్వేజెస్‌లోనూ పాపులర్ అయిన ఫాహద్‌కు నైబర్‌ ఇండస్ట్రీల నుంచి కూడా ఆఫర్స్‌క్యూ కట్టాయి. ఇప్పటికే తమిళ్‌లో సినిమాలు చేసిన ఈ వర్సటైల్‌ స్టార్‌.. త్వరలో టాలీవుడ్ స్క్రీన్ మీద కూడా సందడి చేయబోతున్నారు. పుష్ప సినిమాలో ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్‌తో తలపడుతున్నారు ఫాహద్. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా షూటింగ్ లో ఇటీవలే జాయిన్ అయ్యారు ఫాహద్.

సౌత్‌లో ఫాహద్‌ జోరు చూసిన బాలీవుడ్ ఇండస్ట్రీ కూడా ఈ టాలెంటెడ్‌ స్టార్‌కు వెల్‌కం చెబుతోంది. యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న సల్మాన్‌ ఖాన్ టైగర్‌ 3లో ఫాహద్ ఫాజిల్‌ కీరోల్‌లో నటించబోతున్నారు. అది కూడా నెగెటివ్‌ రోలే అన్న టాక్‌ వినిపిస్తోంది. ఇప్పటికే సౌత్ నుంచి విజయ్‌ సేతుపతి పాన్ ఇండియా స్టార్‌గా సత్తా చాటుతుండగా.. ఇప్పుడు ఆ లిస్ట్‌లోకి ఫాహద్ కూడా ఎంట్రీ ఇచ్చేశారు. మరి ఈ వర్సటైల్ యాక్టర్ ఇంకెన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ లో ఛాన్స్ లు కొట్టేస్తాడో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Chiranjeevi: మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్న మెగాస్టార్.. బర్త్ డే వేళ 24 విభాగాల్లోని సినీ కార్మికులకు స్వీట్ న్యూస్

లడఖ్‌లో మొట్టమొదటి ‘రోవింగ్’ థియేటర్‌ ఏర్పాటు.. ఇందులో ఓ జాతి చరిత్రను తొలిసారి ప్రదర్శించారు..

MLA Roja: మహాబలిపురం రిసార్ట్‌లో రాఖీ వేడుకలు జరుపుకున్న నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా.. చిత్రాలు