Mehreen Kaur Engaged: ఘనంగా హీరోయిన్ మెహ్రీన్ నిశ్చితార్ధం.. నెట్టింట్లో వైరల్ అవుతున్న ఫోటోలు..

Mehreen Kaur Engagement: 'ఎఫ్ 2' భామ మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా ఇంట త్వరలోనే పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఇటీవల ఆమె నిశ్చితార్ధ వేడుక ఘనంగా...

Mehreen Kaur Engaged: ఘనంగా హీరోయిన్ మెహ్రీన్ నిశ్చితార్ధం.. నెట్టింట్లో వైరల్ అవుతున్న ఫోటోలు..
Mehreen

Updated on: Mar 13, 2021 | 10:47 AM

Mehreen Kaur Engagement: ‘ఎఫ్ 2’ భామ మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా ఇంట త్వరలోనే పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఇటీవల ఆమె నిశ్చితార్ధ వేడుక ఘనంగా జరిగింది. మధ్యప్రదేశ్‌లోని జైపూర్ అలీలా కోటలో మెహ్రీన్‌కు ఆడంపూర్ ఎమ్మెల్యే కుల్‌దీప్ బిష్ణోయ్‌ కుమారుడు భవ్య బిష్ణోయ్‌తో నిశ్చితార్ధం జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలు మెహ్రీన్ తన ఇన్‌స్ట్రాగ్రామ్ ప్రొఫైల్‌లో షేర్ చేయగా.. అవి కాస్తా ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారాయి.

ఇదిలా ఉంటే నిశ్చితార్ధ వేడుకలో భాగంగా భవ్య బిష్ణోయ్‌, మెహ్రీన్ కలిసి పూజలు చేశారు. అనంతరం ఇద్దరూ రింగులు మార్చుకున్నారు. వీరి ఇరువురి నిశ్చితార్ధ వేదిక జోధ్‌పూర్ విల్లా ప్యాలస్‌లో జరిగింది. సినీ తారలు తమన్నా, కళ్యాణి ప్రియదర్శన్, రాహుల్ వైద్య, నిఖిల్ భంబ్రిలు సోషల్ మీడియా వేదికగా వీరికి శుభాకాంక్షలు తెలిపారు. కాగా, మెహ్రీన్ ఎఫ్ 2, కవచం, కృష్ణగాడి వీర ప్రేమగాధ, నోటా, అశ్వత్థామ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ‘ఎఫ్ 3’ సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

మరిన్ని ఇక్కడ చదవండి:

Viral Video: భయంతో పరుగెత్తిన జింక.. వేటాడి.. వెంటాడి.. మట్టుబెట్టిన మొసలి.. థ్రిల్లింగ్ వీడియో వైరల్.!

కన్న కొడుకు కోసం తండ్రి పోరాటం.. మొసలి పొట్ట కోసి బాలుడిని బయటికి తీశాడు.. కానీ.!

కోతిని అమాంతం మింగేసిన రాకాసి బల్లి.! ఒళ్లుగగుర్పొడిచే వీడియో.. నెట్టింట్లో వైరల్.!

Follow Us