Ante Sundaraniki: అంటే సుందరానికీ నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్.. నజ్రియా భూజాలపై తలవాల్చిన నాని..

న్యాచురల్ స్టార్ హీరో నాని (Nani) ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా అంటే సుందరానికీ (Ante Sundaraniki).. బ్రోచేవారెవరురా

Ante Sundaraniki: అంటే సుందరానికీ నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్.. నజ్రియా భూజాలపై తలవాల్చిన నాని..
Ante Sundaraniki

Updated on: May 06, 2022 | 2:43 PM

న్యాచురల్ స్టార్ హీరో నాని (Nani) ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా అంటే సుందరానికీ (Ante Sundaraniki).. బ్రోచేవారెవరురా సినిమాతో హిట్ అందుకున్న డైరెక్టర్ వివేక్ ఆత్రేయా తెరకెక్కిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నాని సరసన మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ హీరోయిన్‏గా నటిస్తోంది. తెలుగులో తొలిసారిగా నజ్రియా నటిస్తున్న చిత్రం ఇదే కావడం విశేషం.. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ పోస్టర్స్, గ్లింప్స్ సినిమాపై మరింత ఆసక్తిని కలిగించాయి. అలాగే.. ఇటీవల విడుదలైన పంచెకట్టు సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా ఈ మూవీ నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.

అంటే సుందరానికీ సినిమా నుంచి సెకండ్ సింగిల్ సాంగ్ ఎంత చిత్రం…అనే లవ్ ట్రాక్ పాటను మే 9న ఉదయం 11.07 నిమిషాలకు విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటిస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. అందులో ఓ బస్సులో నజ్రియా భూజాలపై నాని తల వాల్చి నిద్రపోతుండగా.. నజ్రియా తన చేతిని అడ్డుగా పెట్టి చిరునవ్వుతో కనిపిస్తున్న పోస్టర్ ఆకట్టుకుంటుంది. రొమాంటిక్ ఎంటర్‏టైనర్‏గా తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందిస్తుండగా… యలమంచిలి రవి శంకర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను జూన్ 10న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు ఇప్పటికే చిత్రయూనిట్ అనౌన్స్ చేసింది.

ఇవి కూడా చదవండి

ట్వీట్..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Also Read:Eesha Rebba: అందం అభినయం కలబోత ఈ కుర్రది.. నిషా కళ్ళ ఈషా సోయగం పోగడతరమా

Sarkaru Vaari Paata: అట్లుంటది మహేష్‌తో.. అగ్ర రాజ్యంలో అదరగొట్టనున్న’సర్కారు వారి పాట’

Arjun Kapoor and Malaika Arora: బాలీవుడ్ లో పెళ్లి బాజాలు.. వివాహ బంధంతో ఒక్కటవ్వనున్న మలైకా , అర్జున్

Ranga Ranga Vaibhavanga: వైష్ణవ్ తేజ్ ‘రంగ రంగ వైభవంగా’ మూవీ నుంచి మరో మధురమైన మెలోడీ..