Eagle Movie: ఆకట్టుకుంటున్న ‘ఈగిల్’ మేకింగ్ వీడియో.. విజువల్స్ అదిరిపోయాయి..

|

Feb 06, 2024 | 7:36 AM

డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే నవదీప్, అవసరాల శ్రీనివాస్, మధుబాల కీలకపాత్రలు పోషించగా.. దావ్జాంద్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈమూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ మూవీపై మరింత పైప్ పెంచేశాయి. మరో మూడు రోజుల్లో ఈ మూవీ అడియన్స్ ముందుకు రానుంది.

Eagle Movie: ఆకట్టుకుంటున్న ఈగిల్ మేకింగ్ వీడియో.. విజువల్స్ అదిరిపోయాయి..
Eagle Making Video
Follow us on

హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అలరించేందుకు రెడీగా ఉంటాడు టాలీవుడ్ మాస్ మాహారాజా. ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్.. విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంటారు. గతేడాది వరుసగా హిట్స్ అందుకున్న రవితేజా.. ఇప్పుడు నటిస్తున్న సినిమా ఈగిల్. డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే నవదీప్, అవసరాల శ్రీనివాస్, మధుబాల కీలకపాత్రలు పోషించగా.. దావ్జాంద్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈమూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ మూవీపై మరింత పైప్ పెంచేశాయి. మరో మూడు రోజుల్లో ఈ మూవీ అడియన్స్ ముందుకు రానుంది. ఈ క్రమంలోనే ఈగిల్ ప్రమోషన్స్ వేగం పెంచింది చిత్రయూనిట్. ఈగిల్ టీం సభ్యులతో కలిసి వరుసగా ఇంటర్వ్యూలు ఇచ్చేస్తున్నారు రవితేజ. అలాగే సోషల్ మీడియాలోనూ ఈమూవీపై ఆసక్తిని కలిగిస్తున్నారు.

సంక్రాంతి రిలీజ్ కావాల్సిన సినిమా ఇప్పుడు ఫిబ్రవరి 9న విడుదల కాబోతుంది. గతంలో విడుదలైన ట్రైలర్ ఒక్కసారిగా ఈ మూవీపై హైప్ పెంచేసింది. ఇదివరకు ఎన్నడూ కనిపించని పాత్రలో రవితేజ కనిపించనున్నాడని అర్థమవుతుంది. అలాగే ఇందులో ఆయన పాత్ర ఫుల్ నెగిటివ్ షేడ్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఈగిల్ మేకింగ్ వీడియోను రిలీజ్ చేసింది చిత్రయూనిట్. టీజర్, ట్రైలర్ ను మించిపోయి మరింత క్యూరియాసిటిని కలిగిస్తోంది ఈ వీడియో. బ్యాగ్రౌండ్ మ్యూజిక్, విజువల్స్ అదిరిపోయాయి. ప్రస్తుతం యూట్యూబ్ లో ఈ వీడియోకు సెన్సెషన్ రెస్పాన్స్ వస్తుంది.

ఇదిలా ఉంటే.. ఇగిల్ సినిమాను విశ్వ ప్రసాద్, వివేక్ కూచిభోట్ల నిర్మించారు. ప్రస్తుతం రవితేజ మిస్టర్ బచ్చన్ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. మిరపకాయ్, షాక్ సినిమాల తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తోన్న మూడో సినిమా ఇదే కావడంతో అంచనాలు ఓ రేంజ్ లో నెలకొన్నాయి. అలాగే డైరెక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో మరో ప్రాజెక్ట్ చేయనున్నారు రవితేజ.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.