Venkatesh’s Drishyam 2 : సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ ఎంత కూల్‌గా ఉంటాడో అంతే ఫాస్ట్‌గా సినిమాలను కంప్లీట్ చేస్తాడు. ఆ వెంటనే కొత్త సినిమాలను మొదలుపెడుతుంటాడు. చిన్న దర్శకుడు స్టార్ దర్శకుడు అనే తేడాలు లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఓ పక్క నారప్ప… ఎఫ్3 షూట్ లో పాల్గొంటూనే.. మరో పక్క దృశ్యం2 సినిమాని పట్టాలెక్కించాడు.
తాజాగా వెంకటేష్ దృశ్యం2 సినిమాకు కొబ్బరి కాయ కొట్టేశాడు. అప్పుడెప్పుడో తెలుగులో రిలీజైన మళయాల మాతృక దృశ్యం 1 కు సీక్వెల్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అయితే దృశ్యం1 కు సినిమాకు శ్రీప్రియ దర్శకత్వం వహించగా ప్రస్తుత సీక్వెల్‌కు మళయాల డైరెక్టర్ జీతూ జోసెఫ్ మెగాఫోన్ పట్టనున్నారు. ఇక దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాన్ని రీసెంట్ గా హైదరాబాద్‌లో నిర్వహించారు. మార్చి 5 నుంచి రెగ్యులర్ షూటింగ్ జరగునున్నట్టు చిత్రబృందం తెలిపింది.
అయితే ఇటవల మలయాళంలో రిలీజైన దృశ్యం2 సినిమా అందరినీ ఆకట్టుకుని వన్ ఆఫ్ ది బెస్ట్ సీక్వెల్ సినిమా అందరి మన్ననలు పొందుతుంది. దీంతో వెంటనే తెలుగు రీమేక్ చేయాలని వెంకటేష్ భావించారు. దాంతో దృశ్యం2కు వెంకటేష్ పచ్చజెండా ఊపారు. మొదటి సినిమాలో నటించిన దాదాపు అదే నటీనటులు ఈ సినిమాలో కూడా నటించనున్నారు. ఇక ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇక వెంకటేష్ నటిస్తున్న నారప్ప సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళ్ లో సూపర్ హిట్ గా నిలిచిన అసురన్ సినిమాకు రీమేక్ గా ఈ సినిమా రూపొందింది. ఈ మూవీకి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే 2019 సంక్రాంతికి విడుదలైన ఎఫ్2 సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న ‘ఎఫ్3’ లోనూ నటిస్తున్నాడు. ఈ సినిమాకు అనీల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు.
మరిన్ని ఇక్కడ చదవండి :
Jathi Ratnalu movie : పాన్ ఇండియా స్టార్ చేతులమీదుగా విడుదల కానున్న జాతిరత్నాలు ట్రైలర్..
Keerthy Suresh : టాలీవుడ్‌లో తక్కువ టైంలో టాప్ హీరోయిన్‌గా దూసుకుపోతున్న మహానటి.