ఘ‌నంగా మూవీ మొగల్ డా.డి రామానాయుడు 85వ జయంతి వేడుక‌లు

| Edited By: Pardhasaradhi Peri

Jun 06, 2020 | 3:10 PM

మూవీ మొగల్ డా.డి రామానాయుడు 85 వ జయంతి కార్యక్రమం హైదరాబాదు ఫిలిం ఛాంబర్ లో జరిగింది. ‌ఈ కార్యక్రమం లో సి.కల్యాణ , అభిరామ్ దగ్గుబాటి, కార్పొరేటర్ కాజా సూర్యనారాయణ పాల్గొని రామానాయుడు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు..

ఘ‌నంగా మూవీ మొగల్ డా.డి రామానాయుడు 85వ జయంతి వేడుక‌లు
Follow us on

మూవీ మొగల్ డా.డి రామానాయుడు 85 వ జయంతి కార్యక్రమం హైదరాబాదు ఫిలిం ఛాంబర్ లో జరిగింది. ‌ఈ కార్యక్రమం లో సి.కల్యాణ్ , అభిరామ్ దగ్గుబాటి, కార్పొరేటర్ కాజా సూర్యనారాయణ పాల్గొని రామానాయుడు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు..

కాజా సూర్యనారాయణ మాట్లాడుతూ… 85 వ జయంతి సందర్భంగా రామానాయుడు గారికి నివాళులు అర్పించాము. రామానాయుడుగారు లేకుంటే హైదరాబాదులో సినిమా పరిశ్రమ, ఫిలిం నగర్ హౌసింగ్ సొసైటీ ఉండేది కాదు..రామానాయుడు గారి పేరుతో ఏది మొదలు పెట్టినా సక్సెస్ అవుతుంది. ఫిలింనగర్ కు చెన్నారెడ్డి, దాసరి, రామానాయుడు గారు దేవుళ్ళు లాంటి వారున్నారు.

సి‌.కల్యాణ్ మాట్లాడుతూ .. రామానాయుడు గారంటే మాకు ఓ హీరో, రోల్ మోడల్. నాకు దాసరి గారు, రామానాయుడు గారు ఎంతో ప్రొత్సాహం ఇచ్చిన‌ వ్యక్తులు. నిర్మాతలగానే కాకుండా .. సినీ పరిశ్రమ, దానికి అనుంబంద ఆఫీసులన్నీ డెవ‌ల‌ప్ కావ‌డానికి రామానాయుడుగారే కారణం. నాయుడు గారిని తలుచుకునే మేము సినిమా స్టార్ట్ చేస్తాము. ఆయన జయంతిని ఎప్పుడు గొప్పగా జరుపుకుంటాము అని తెలిపారు

రామానాయుడు మ‌న‌వ‌డు ద‌గ్గుబాటి అభిరామ్ మాట్లాడుతూ.. తాత గారు ఫిజికల్ లేకున్నా ,మెంటల్ గా నాకు సపోర్ట్ గానే ఉన్నారు…ఎల్లకాలం ఉంటారు అని పేర్కొన్నారు.