Tollywood: అడ్డంగా బుక్కైన టాలీవుడ్ నటుడు.. కేసు పెట్టిన భార్య

సినిమా హీరోగా ఇప్పుడిప్పుడే పాపులర్ అవుతున్న ధర్మ మహేశ్ వ్యక్తిగత జీవితంలో వివాదాల్లో చిక్కుకున్నారు. అదనపు కట్నం కోసం వేధింపులు చేస్తున్నారంటూ ఆయన భార్య గచ్చిబౌలి మహిళా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో మహేశ్, కుటుంబ సభ్యులపై కేసు నమోదు అయింది ..

Tollywood:  అడ్డంగా బుక్కైన టాలీవుడ్ నటుడు.. కేసు పెట్టిన భార్య
Actor Dharma Mahesh

Updated on: Aug 18, 2025 | 7:34 PM

టాలీవుడ్ యాక్టర్ వరకట్న వేధింపులు ఆరోపణలతో బుక్కయ్యాడు. ‘సిందూరం’ (2023), ‘డ్రింకర్ సాయి’ సినిమాల ద్వారా పాపులర్ అయిన నటుడు ధర్మ మహేశ్‌పై ఆయన భార్య కేసు నమోదు చేసింది. అదనపు కట్నం కోసం తనను వేధిస్తున్నారని ఆరోపిస్తూ భార్య గచ్చిబౌలి మహిళా పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో మహేశ్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంతకు ముందు కూడా వరకట్నం వేధింపుల ఆరోపణలపై పోలీసులు ధర్మ మహేశ్‌కు కౌన్సిలింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయినా అతని ప్రవర్తనలో మార్పు రాలేదని, వేధింపులు కొనసాగిస్తున్నాడని ఆరోపిస్తూ మళ్లీ ఆమె ఫిర్యాదు చేశారు. గౌతమిని 2019లో వివాహం చేసుకున్నాడు నటుడు ధర్మ మహేష్. దంపతులకు ఒక కుమారుడు కుడా ఉన్నాడు.  సినిమా అవకాశాలు పెరిగిన తర్వాత ధర్మ మహేష్ జల్సాలకు అలవాటు పడి.. తనను అదనపు కట్నం తేవాలని వేధిస్తున్నట్లు భార్య ఆరోపిస్తున్నారు.

కేసు నమోదు కావడంతో టాలీవుడ్‌లో మరోసారి వరకట్న వేధింపులు, గృహ హింసపై చర్చ మొదలైంది. ముఖ్యంగా కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చిన యువ నటుల వ్యక్తిగత జీవితం, వివాహ సంబంధాలపై ఇలాంటి ఆరోపణలు వెలుగులోకి రావడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. పోలీసులు ప్రస్తుతం ఫిర్యాదును విచారణలోకి తీసుకొని, మరింత సమాచారం సేకరిస్తున్నట్లు తెలియజేశారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.