
ఓటీటీల జోరు కొనసాగుతోంది. సూపర్ హిట్ సినిమాలు, క్రేజీ వెబ్ సిరీస్‌లతో ప్రేక్షకులు విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు. కొత్త సినిమాలను థియేటర్స్‌లో చూస్తూ.. అలాగే రిలీజ్ అయిపోయిన సినిమాలను ఓటీటీలో ఎంజాయ్ చేస్తున్నారు ప్రేక్షకులు. ఇక ఓటీటీ లవర్స్‌ను ఆకట్టుకునేలా రకరకాల సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఓటీటీలో రిలీజ్ అయ్యి ఆకట్టుకుంటున్నాయి. ఇక హారర్, రొమాంటిక్, థ్రిల్లర్ మూవీస్‌కు మంచి క్రేజ్ ఉంది. వివిధ ఓటీటీ సంస్థలో చాలా రకాల సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇక రొమాంటిక్ సినిమాలకు సపరేట్ ఫ్యాన్స్ ఉంటారు. ఇక ఓటీటీలో ఇప్పటికే చాలా రకాల రొమాంటిక్ సినిమాలు ఓటీటీల్లో ఉన్నాయి. ఇక ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ రొమాంటిక్ మూవీ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఈ రొమాంటిక్స్ సినిమాలో ఓ స్టార్ హీరోయిన్ నటించింది.
ఈ సినిమాలో బోల్డ్ సీన్స్ కు కొదవే లేదు.. ఈ సినిమాలోని రొమాంటిక్ సీన్స్ పెద్ద వివాదాన్ని సృష్టించింది. ఎన్నో విమర్శలు ఎదుర్కొంది ఈ సినిమా. మహిళా సంఘాలు కూడా ఈ సినిమా పై మండిపడ్డాయి. అంతే కాదు డైరెక్టర్ ను చితకొట్టుడు కొట్టారు కూడా.. ఈ సినిమా పేరు సింధు సామవేళి. ఈ సినిమా సుందర్ అనే యువకుడి చుట్టూ జరుగుతుంది. అతను తన భార్య సింధుతో కలిసి సాధారణ జీవితం గడుపుతుంటాడు. అయితే, సుందర్ తన తండ్రితో కలిసి ఉండాల్సి వస్తుంది.
అయితే కొడుకు చదువు నిమిత్తం విదేశాలకు వెళితే ఎక్స్ మిలిటెంట్ అయిన తండ్రి కోడలితో అక్రమ సంబంధం పెట్టుకోవడం ఈ సినిమా కథాంశం.. కోడలిని లొంగదీసుకునే మామ అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా రూపొందింది. దాంతో ఈ సినిమా పై పెద్దెత్తున విమర్శలు వచ్చాయి. కాగా ఈ సినిమాలో నటించిన హీరోయిన్ గా అమలాపాల్ నటించింది. ఈ సినిమాలో బోల్డ్ సన్నివేశాలకు కొదవేలేదు. కాగా ఈ సినిమా విడుదలైన తర్వాత ఈ సినిమా దర్శకుడు స్వామి, హీరోయిన్ అమలాపాల్ పై కూడా దాడి జరిగింది. గతంలో ఈ సినిమా గురించి అమలాపాల్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కెరీర్ బిగినింగ్ లో ఆ సినిమా చేసి తప్పు చేశానని.. ఆ సినిమా తన జీవితం పై ప్రభావం చూపిందని తెలిపింది. ఆ సినిమా సమయంలో తనకు కేవలం 17 ఏళ్లు మాత్రమే అని ఆ సమయంలో తనపై కూడా దాడి జరిగిందని తెలిపింది అమలాపాల్. ఈ సినిమా ఇప్పుడు యూట్యూబ్ లో ఫ్రీగా చూడొచ్చు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.