ఒంటరిగా చూస్తే గుండె ప్యాంట్‌లోకి వస్తుంది.. దైర్యమున్నవాళ్ళే చూడాల్సిన సినిమా..

చాలా మంది సినీ లవర్స్ హారర్ సినిమాలు చూడటానికి ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఎంత భయంగా అనిపించినా కూడా కళ్లు మూసుకుంటూనే చూసేవారు చాలా మంది ఉంటారు. కానీ ఒంటరిగా చూడాలంటే మాత్రం భయమే. ఓటీటీల్లోనూ హారర్ సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది.

ఒంటరిగా చూస్తే గుండె ప్యాంట్‌లోకి వస్తుంది.. దైర్యమున్నవాళ్ళే చూడాల్సిన సినిమా..
Ott Movie

Updated on: Sep 06, 2025 | 2:48 PM

థిల్లర్ సినిమాలకు, హారర్ మూవీలకు ఓటీటీలో ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓటీటీల పుణ్యమా అని ప్రేక్షకులు డబుల్ ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్ చేస్తున్నారు. ఓ వైపు కొత్త సినిమాలు థియేటర్స్ లో అదరగొడుతుంటే మరో వైపు ఓటీటీల్లో సినిమాలు మెప్పిస్తున్నాయి. ఓటీటీలో ఎక్కువగా రొమాంటిక్ సినిమాలు, థ్రిల్లర్, హారర్ సినిమాలు చూడటానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు ప్రేక్షకులు. ఇక ఇప్పటికే ఎన్నో రకాల హారర్ సినిమాలు ఓటీటీని ఊపేస్తున్నాయి. తాజాగా ఓ హారర్ సినిమా ప్రేక్షకులను వణికించేస్తోంది. అమ్మబాబోయ్ ఈ సినిమా చూడాలంటే దైర్యం ఉండాల్సిందే.. దైర్యం లేనివాళ్లు ఈ సినిమా చూడకపోవడమే మంచిది. సీన్ సీన్ కు పోసుకోవాల్సిందే.. ఇంతకూ ఈ సినిమా ఏదంటే..

అప్పుడు ఎవడ్రా బిగ్ బాస్ అంది.. ఇప్పుడు ఓటేయమని కన్నీళ్లు పెట్టుకుంది

ఈ సినిమా గతంలో వచ్చిన ఓ మూవీకి సీక్వెల్. మొదటి భాగంలో హీరో  తన కూతురుని ఒక దెయ్యం నుంచి కాపాడుతాడు. అయితే ఈ సినిమాలో దెయ్యం ఆ అమ్మాయిని ఇంకా వదలలేదని 12 సంవత్సరాల తర్వాత హీరోకు తెలుస్తుంది. ఈసారి,   స్కూల్ బాలికలు హింసాత్మకమైన వశీకరణ చేస్తున్నారని తెలుస్తుంది. ఈ ఘటనల వెనుక మొదటి భాగంలోని బ్లాక్ మ్యాజిక్ వాడే మాంత్రికుడు చేతి ఉందని తెలుస్తుంది. దాంతో హీరో మళ్లీ తన కూతురును, అలాగే ఇంకొంతమంది బాధితులను రక్షించడానికి ఈ చీకటి శక్తులతో పోరాడాల్సి వస్తుంది. కథలో భయానక సన్నివేశాలు, సైకలాజికల్ ట్విస్ట్‌లు, అలాగే థ్రిల్లింగ్ అంశాలు ప్రేక్షకులను సీటు అంచున కూర్చోబెడతాయి. సినిమా నిడివి 1 గంట 35 నిమిషాలే అయినప్పటికీ, ప్రతి సన్నివేశం ఒళ్ళు గగుర్పొడిచేలా ఉంటుంది.

ఆ హీరోయిన్ నాకు చెల్లెలు లాంటిది.. దుల్కర్ సల్మాన్ కామెంట్స్ వైరల్

ఆ సినిమా పేరు వాష్ లెవల్ 2  2025లో విడుదలైన గుజరాతీ సూపర్‌నాచురల్ సైకలాజికల్ హర్రర్ థ్రిల్లర్ చిత్రం, ఇది 2023లో వచ్చిన వాష్ చిత్రానికి సీక్వెల్. కృష్ణదేవ్ యాగ్నిక్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో జానకీ బోడివాలా, హితూ కనోడియా, మోనల్ గజ్జర్, హితెన్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా గుజరాతీతో పాటు హిందీలో కూడా విడుదలైంది. ఆగస్టు 27, 2025న థియేటర్లలో విడుదలైంది. త్వరలోనే ఈ సినిమా ఓటీటీలోనూ రానుంది. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు. థియేటర్ లో ఈ సినిమాను అస్సలు మిస్ అవ్వకండి.

ఇవి కూడా చదవండి