కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ శుక్రవారం ఉదయం గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. వ్యాయమం చేస్తున్న సమయంలో గుండెపోటు రావడంతో హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.. ఆ తర్వాత వెంటనే బెంగుళూరులోని విక్రమ్ ఆసుపత్రికి తరలించి వెంటిలేటర్ పై చికిత్స అందించగా.. చికిత్స తీసుకుంటునే పునీత్ కన్నుముశారు. పునీత్ అకాలమరణంతో ఆయన కుటుంబసభ్యులతోపాటు కన్నడ చిత్రపరిశ్రమ.. అభిమానులు ఒక్కసారిగా షాకయ్యారు. అయితే హెవీ వర్కవుట్స్ చేయడం వలనే గుండెపోటుకు గురయ్యి చనిపోయారు.. నెట్టింట్లో టాక్ నడుస్తోంది. అంతేకాదు.. హెవీ వర్కవుట్స్ చేయడంతోనే పునీత్ మరణించారని పలు వెబ్ సైట్స్ కథనాలు వెల్లడించాయి. తాజాగా పునీత్ మరణం పై విక్రమ్ ఆసుపత్రి వైద్యులు స్పందించారు.
శుక్రవారం ఉదయం 9 గంటల సమయంలో పునీత్ వ్యాయమం చేశారు.. ఆ తర్వాత టిఫిన్ చేసిన తర్వాత కొంత అస్వస్తతకు గురయ్యారు. దీంతో తన భార్య అశ్వినితో కలిసి తమ కుటుంబ వైద్యుడు డాక్టర్ రమణరావు క్లినిక్ కు వెళ్లారు.. జిమ్ లో వ్యాయమం చేసిన తర్వాత తనకు చెమటలు పట్టాయని.. అన్ని రకాల వ్యాయమాలు చేశానని డాక్టర్ రమణరావుకు చెప్పారు. దీంతో ఆయనకు ఈసీజీ టెస్ట్ చేయగా.. గుండె కొట్టుకోవడంలో కాస్త తేడా కనిపించింది. వెంటనే అప్రమత్తమైన వైద్యులు.. ఆయనను విక్రమ్ ఆసుపత్రికి తరలించారు.. కారు వరకు నడిచిన పునీత్ ఇబ్బంది పడే అవకాశం ఉందని.. ఆయనను చక్రాల కుర్చిలో కారు వరకు తీసుకెళ్లారు. అదే సమయంలో విక్రమ్ ఆసుపత్రికి ఫోన్ చేసిన పునీత్ భార్య ఆయన పరిస్థితిని వివరించారు.. ఉదయం 11.45 గంటలకు ఆసుపత్రికి చేరుకున్నారు. అక్కడ సిద్ధంగా ఉన్న వైద్యులు ఆయనకు వెంటిలేటర్ అమర్చారు. తీవ్ర గుండెపోటుతో వెంటిలేటర్ అమర్చిన కాసేపటికే పునీత్ మరణించినట్టు డాక్టర్లు తెలిపారు.
ఇక పునీత్ మరణంపై డాక్టర్ దేవి శేట్టి స్పందించారు. ఫిట్ గా ఉండేందుకు వ్యాయమం చేయడం వలన మరణించిన వారిలో ఎక్కువ మంది 40 ఏళ్లలోపు వారే ఉన్నారన్నారు.. కేవలం 20 నిమిషాల నుంచి 30 నిమిషాలు మాత్రమే వ్యాయమం చేయాలని.. నడక వ్యాయమం మంచిదని తెలిపారు. సప్లిమెంట్స్ తీసుకోవద్దని.. వారానికి రెండు పెగ్గులు మాత్రమే తాగాలని.. ధూమాపానం అలవాటు మానుకోవాలని సూచించారు. శరీరం మనస్సు.. తీవ్రమైన ఒత్తిడిని భరించలేవన్నారు.
Also Read: Samantha: ఒత్తిడిలో తీసుకున్న నిర్ణయాలు మనమేంటో తెలియజేస్తాయి.. ఆసక్తికర పోస్ట్ చేసిన సమంత..
Puneeth Raj Kumar: బరువెక్కిన గుండెలతో అభిమాన హీరోకు వీడ్కోలు.. పునీత్ నుదుటిపై ముద్దాడిన సీఎం..