ఈ ఫొటోలో అమాయకంగా కనిపిస్తున్న బుల్లోడిని గుర్తుపట్టారా.? తోప్ హీరో అతను..

చైల్డ్ హుడ్ ఫోటోలు సోషల్ మీడియాలో నిత్యం పదుల సంఖ్యలో వైరల్ అవుతూ ఉంటాయి. సినీ సెలబ్రెటీలకు సంబందించిన ఫోటోలను అభిమానులు తెగ షేర్ చేస్తూ ఉంటారు. చాలామంది తమ అభిమాన హీరోల ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటారు. అలాగే ఇప్పుడు ఓ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.

ఈ ఫొటోలో అమాయకంగా కనిపిస్తున్న బుల్లోడిని గుర్తుపట్టారా.? తోప్ హీరో అతను..
Hero

Updated on: Mar 08, 2025 | 7:11 PM

సినిమా ఇండస్ట్రీలో అతనొక స్టార్ హీరో.. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించాడు. ఎన్నో వై విద్యమైన పాత్రలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. పై ఫొటోలో అమాయకంగా కనిపిస్తున్న ఆ చిన్నోడు ఎవరో గుర్తుపట్టారా.? తన  నటనతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నాడు ఆ హీరో. ఇంతకూ ఆ హీరో ఎవరో గుర్తుపట్టారా.? ఈ స్టార్ హీరో చైల్డ్ హుడ్ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇంతకూ ఆతను ఎవరో తెలుసా.? కనిపెట్టలేకపోతున్నారా.? మీకోసం  ఓ క్లూ అతను ఓ తమిళ్ స్టార్ హీరో. తెలుగులోనూ సినిమాలు చేసి మెప్పించాడు. తమిళ్ తో పాటు తెలుగులోనూ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నాడు ఆ హీరో. అతను ఎవరంటే..

పై ఫొటోలో కనిపిస్తున్న హీరో మరెవరో కాదు తమిళ్ హీరో జీవా. చిన్న వయసులోనే రెండు సినిమాల్లో అతిధి పాత్రలు పోషించాడనేది చాలా తక్కువ మందికి తెలిసిన వాస్తవం. అతని తండ్రి, ఆర్‌బి చౌదరి, 1991లో కె.ఎస్. రవికుమార్ దర్శకత్వం వహించిన చేరన్ పాండియన్ చిత్రంలో కనిపించాడు జీవ. జీవ తండి తెలుగు నిర్మాత ఆర్‌బి చౌదరి. సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేశారు ఆర్‌బి చౌదరి.

తండ్రి తెలుగు నిర్మాత అయినా తమిళ్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు జీవ. 2003 చిత్రం ఆసే ఆసేతో తమిళ సినిమాలో నటుడిగా అరంగేట్రం చేశాడు. ఆతర్వాత చాలా సినిమాల్లో నటించి మెప్పించాడు. ఇక జీవ నటించిన రంగం సినిమా తెలుగులోనూ విడుదలై సూపర్ హిట్ అందుకుంది. అలాగే జీవ నటించిన సినిమాలు తెలుగులోనూ విడుదలై మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి. ఇటీవలే జగన్ బయోపిక్ యాత్ర 2లోనూ నటించాడు జీవ.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..