
నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటించడానికి ఎప్పుడు రెడీగా ఉంటారు. సినిమాల కోసం చాలా మంది గ్లామర్ పాత్రలను పక్కన పెట్టేసి డీ గ్లామర్ లో కనిపించడానికి కూడా రెడీ అవుతుంటారు. ఇంతకు పై ఫొటోలో ఉన్న హీరోయిన్ ను గుర్తుపట్టారా..? ఒక ఒక్క సినిమాతో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది ఈ అమ్మడు. లవర్ ఉంటే ఇలానే ఉండాలి అంటూ అప్పట్లో కుర్రకారు ఈ చిన్నదాని గురించి తెగ కలలు కన్నారు. ఆ తర్వాత ఊహించని విధంగా సినిమాలకు దూరం అయిపొయింది ఈ చిన్నది. ఈ మధ్యనే సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. రీ ఎంట్రీలో హాట్ లుక్స్ లో కేకపుట్టించింది. బోల్డ్ పాత్రలో నటించి పిచ్చేక్కించింది. ఇంతకు ఆ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా..?
పై ఫొటోలో ఉన్న హాట్ బ్యూటీ ఎవరో కనిపెట్టారా..? ఆమె మరెవరో కాదు ఆ భామ పేరు శ్వేతా బసు ప్రసాద్. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన సినిమాలో కొత్తబంగారు లోకం సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఇంటర్ మీడియట్ లవ్ స్టోరీతో తెరకెక్కిన ఈ సినిమా యువతను విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా శ్వేతా బసు ప్రసాద్ లుక్, ఆమె నటన ప్రేక్షకులను మెప్పించింది.
ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసింది. కానీ సాలిడ్ సక్సెస్ మాత్రం అందుకోలేక పోయింది. ఆ తర్వాత ఊహించిన విధంగా సినిమాలకు దూరం అయ్యింది. ఆతర్వాత బాలీవుడ్ లో సినిమాలు చేసింది శ్వేతా బసు ప్రసాద్. ఇక ఇప్పుడు ఈ అమ్మడు బాలీవుడ్ లో వరుసగా అవకాశాలు అందుకుంటుంది. వెబ్ సిరీస్ లోనూ నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇటీవలే ఓ వెబ్ సిరీస్ లో బోల్డ్ పాత్రలో నటించి మెప్పించింది శ్వేతా బసు ప్రసాద్.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి