Tollywood : ఐశ్వర్య రాయ్‏కే పోటీ ఇచ్చింది.. స్టార్ హీరోయిన్ అవుతుందనుకుంటే.. ఇప్పుడు హిమాలయాల్లో సన్యాసిగా మారింది..

సినీరంగంలో కథానాయికగా ఓ వెలుగు వెలగడం అంతే సులభం కాదు. తక్కువ సమయంలోనే తమకంటూ గుర్తింపు తెచ్చుకున్న తారలు చాలా మంది ఉన్నారు. అలాగే ఒక్క సినిమాతోనే పాపులర్ అయ్యి.. ఆ తర్వాత కనిపించకుండా పోయిన స్టార్స్ ఉన్నారు. అందులో ఈ హీరోయిన్ ఒకరు. అందంలో ఏకంగా ఐశ్వర్య రాయ్ కే ఛాలెంజ్ చేసింది. కట్ చేస్తే.. ఇప్పుడు హిమాలయాల్లో సన్యాసిగా సెటిల్ అయ్యింది.

Tollywood : ఐశ్వర్య రాయ్‏కే పోటీ ఇచ్చింది.. స్టార్ హీరోయిన్ అవుతుందనుకుంటే.. ఇప్పుడు హిమాలయాల్లో సన్యాసిగా మారింది..
Aishwarya Rai, Barkha Madan

Updated on: May 04, 2026 | 8:04 AM

సినీరంగంలో ఐశ్వర్య రాయ్ ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో చక్రం తిప్పింది ఈ ముద్దుగుమ్మ. కానీ అలాంటి హీరోయిన్ కే చుక్కలు చూపించింది ఓ అమ్మడు. మాధురి దీక్షిత్, ఐశ్వర్య రాయ్ వంటి హీరోయిన్స్ వరుస సినిమాలతో దూసుకుపోతున్న సమయంలోనే చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. అడుగుపెట్టిన తొలి నాళ్లల్లోనే ఒక్కసారిగా హాట్ టాపిక్ అయ్యింది. దీంతో అప్పట్లో ఇండస్ట్రీలో ఆమె పేరు మారుమోగింది. ఆమెకు స్టార్ హీరోల సరసన వరుస అవకాశాలు క్యూ కట్టాయి. ఆమె స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతుందని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు. కోట్ల ఆస్తులు, లగ్జరీ లైఫ్ వదిలి ఎవరూ ఊహించని విధంగా ఆమె సన్యాసిగా మారింది. ఒకప్పుడు రెడ్ కార్పెట్ మీద నడిచిన ఈ అమ్మడు.. ఇప్పుడు ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతుంది. ఆమె పేరు బర్ఖా మదన్.

ఎక్కువ మంది చదివినవి :  Tollywood : రూ.5 వేలకు స్కూల్లో టీచర్.. ఇప్పుడు ఒక్కో సినిమాకు కోట్లలో రెమ్యునరేషన్.. పాన్ ఇండియా గ్లామరస్ హీరోయిన్..

బర్ఖా మదన్.. ఈ తరం ప్రేక్షకులకు ఈ పేరు అంతగా తెలియకపోవచ్చు. కానీ 90’s యూత్ కు ఆమె ఆరాధ్య దేవత. ఒకప్పుడు మిస్ ఇండియా అందాలో పోటీలలో సుస్మితా సేన్, ఐశ్వర్య రాయ్ వంటి అందగత్తెలతో కలిసి ర్యాంప్ వాక్ నడిచింది. సినిమాల్లో తన గ్లామర్ లుక్స్, నటనతో కట్టిపడేసింది. బర్ఖా మదన్…. 1994లో మిస్ ఇండియా పోటీలలో పాల్గొంది. అక్కడ మిస్ టూరిజం ఇండియా టైటిల్ గెలిచింది. అలాగే మలేషియాలో జరిగిన అంతర్జాతీయ అందాల పోటీలో మూడవ స్థఆనంలో నిలిచింది.

ఎక్కువ మంది చదివినవి : Krishna Vamsi : రమ్య కృష్ణతో ప్రేమ, పెళ్లికి ఆ పాటనే కారణం.. డైరెక్టర్ కృష్ణ వంశీ..

1996లో ఖిలాడియోం కా ఖిలాడి సినిమాతో ఆమెకు మరింత గుర్తింపు వచ్చింది. 2003లో రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన భూత్ సినిమాతో ఆమెకు మరింత పాపులర్ అయ్యింది. ఒక్క సినిమాతోనే విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. సినిమాలే కాకుండా బుల్లితెరపై పలు సీరియల్స్ చేసింది. వరుస అవకాశాలు వస్తున్న సమయంలోనే సినిమాలకు దూరమై సన్యాసం తీసుకుంది. ఇప్పుడు హిమాలయాల్లో ప్రశాంతంగా జీవిస్తుంది.

ఎక్కువ మంది చదివినవి : Gopichand : జయం సినిమాకు నాకు ఇచ్చిన రెమ్యునరేషన్ అంతే.. ఎలా ఖర్చు చేశానంటే.. గోపిచంద్ కామెంట్స్..

ఎక్కువ మంది చదివినవి : Sekhar Kammula : ఆ సినిమా తీసి తప్పు చేశాను.. అది ఒక పొరపాటు మాత్రమే.. డైరెక్టర్ శేఖర్ కమ్ముల కామెంట్స్..

Follow Us