
హీరోయిన్స్ గా రాణించడం అంత ఈజీ కాదు. చాలా మంది హీరోయిన్స్ స్టార్ డమ్ కోసం చాలా కష్టపడుతూ ఉంటారు. యంగ్ హీరోయిన్స్ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నారు. హీరోలకు సమానంగా రెమ్యునరేషన్ అందుకుంటున్నారు కొంతమంది భామలు. ఇదిలా ఉంటే కొంతమంది ముద్దుగుమ్మలు ఒకటి రెండు సినిమాలతోనే ఇండస్ట్రీకి దూరం అవుతున్నారు. పై ఫొటోలో కనిపిస్తున్న బ్యూటీని గుర్తుపట్టారా.? తెలుగులో ఒకే ఒక్క సినిమా చేసింది. ఆ సినిమా కూడా అట్టర్ ఫ్లాప్. ఆతర్వాత ఓ హీరోని ప్రేమించి పెళ్లాడింది. ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటుంది. ఇంతకూ ఆ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టారా.? సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ చిన్నది.
ఆమె ఎవరో కాదు అందాల భామ సయేషా. క్రేజీ బ్యూటీ సయేషా 2015లో అఖిల్ సినిమాతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది.ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోకపోయినా.. సయేషా అందానికి మంచి మార్కులు పడ్డాయి. అఖిల్ సినిమా తర్వాత ఈ అమ్మడు బాలీవుడ్ కు చెక్కేసింది. అక్కడ వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయింది. హిందీ సినిమాలతో పాటు తమిళ్ లోనూ సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయింది ఈ అందాల భామ.
అక్కడ తక్కువ కాలంలోనే సూర్య, కార్తీ, విజయ్ సేతుపతి, ఆర్య వంటి హీరోలతో సయేషా నటించింది. ఓ తమిళ్ సినిమా షూటింగ్ లో ఆర్య , సయేషా మధ్య ప్రేమ చిగురించింది. 2019లో ఆర్య, సయేషాల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఆగస్టు 12న ముంబైలో జన్మించింది సయేషా. ఆమె బాలీవుడ్ నటుడు సైరా బాను, దిలీప్ కుమార్‌లకు మనవరాలు. పెళ్లి తర్వాత సయేషా సినిమాలకు దూరంగా ఉంటుందో. ఈ స్టార్ కపుల్ కు ఓ కూతురు కూడా ఉంది. కాగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ చిన్నది రెగ్యులర్ గా డాన్స్ వీడియోలు చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి