
సోషల్ మీడియాలో స్టార్ హీరోహీరోయిన్స్ చిన్ననాటి ఫోటోస్ తెగ వైరలవుతున్న సంగతి తెలిసిందే. సౌత్ టూ నార్త్ సెలబ్రెటీస్ వ్యక్తిగత విషయాలు.. అరుదైన ఫోటోస్.. బాల్య జ్ఞాపకాలు తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. ఇటీవల చాలా మంది స్టార్ హీరోల చిన్ననాటి ఫోటోస్ తెగ వైరలయ్యాయి. తాజాగా ఇద్దరు స్టార్ హీరోల పిక్ నెట్టింటిని షేక్ చేస్తుంది. పైన ఫోటోను చూశారు కదా.. ఆ ఫొటోలో ఉన్న ఇద్దరిలో ఓ పాన్ ఇండియా స్టార్ హీరో, ఓ టాలీవుడ్ హీరో ఉన్నారు. ఈ ఇద్దరిలో ఓ హీరోని గుర్తుపట్టడం ఈజీ.. కానీ మరో హీరోయిన్ గుర్తుపట్టడం కష్టమే.. అంతేకాదు.. వైవిధ్యమైన సినిమాలను ఎంచుకుంటూ ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ తెచ్చుకున్నారు ఇద్దరూ.. ఇంతకూ ఆ ఇద్దరూ ఎవరో తెలుసా.?
పై ఫొటోలో ఉన్న స్టార్ హీరోలు మరెవరో కాదు.. ఒకరు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మరొకరు లేటెస్ట్ సెన్సేషన్ యంగ్ హీరో రోషన్ మేక. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ ఫొటోలో రోషన్ ను ఎత్తుకున్నాడు. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే.. పెళ్ళిసందడి సినిమాతో హీరోగా మారాడు రోషన్. ఆతర్వాత చిన్న గ్యాప్ తీసుకొని ఇప్పుడు ఛాంపియన్ అనే చేస్తున్నారు. రీసెంట్ గా ఈ మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. డిసెంబర్ 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు గెస్ట్ గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హాజరయ్యారు. చిరంజీవి ఫ్యామిలీకి , శ్రీకాంత్ ఫ్యామిలీ చాలా మంది అనుబంధం ఉంది. చిరంజీవి, శ్రీకాంత్ కలిసి శంకర్ దాదా ఎంబీబీఎస్, శంకర్ దాదా జిందాబాద్ సినిమాలో కలిసి నటించారు. ఇక చరణ్ , శ్రీకాంత్ కలిసి గోవిందుడు అందరివాడేలే సినిమాలో నటించారు. ప్రస్తుతం రామ్ చరణ్ పెద్ది సినిమాలో నటిస్తున్నారు. రోషన్ ఛాంపియన్ సినిమాతో మంచి విజయాన్ని అందుకోవడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.