తస్సాదియ్యా.. ఆ హీరోయిన్ ఈమేనా.. చూస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే

|

Dec 24, 2024 | 12:27 PM

వెండితెరపై ఎప్పటికప్పుడు కొత్త కొత్త నటీనటులు సందడి చేస్తుంటారు. ముఖ్యంగా అందాల తారలు ఒక్క సినిమాతోనే ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్నారు. అయితే తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుని.. ఆ తర్వాత స్టార్ హీరోయిన్ గా మారిన వారు చాలా మంది ఉండగా.. ఒకటి రెండు చిత్రాలతో ఇండస్ట్రీకి దూరమైనవారున్నారు. అ

తస్సాదియ్యా.. ఆ హీరోయిన్ ఈమేనా.. చూస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
Tollywood
Follow us on

సినీ ఇండస్ట్రీలో కొత్త హీరోయిన్స్ సందడి ఎక్కువగా కనిపిస్తుంది. ఒకొక్క సినిమాకు కొత్త కొత్త హీరోయిన్స్ ప్రేక్షకులను అలరిస్తున్నారు. అలాగే కొంతమంది ముద్దుగుమ్మలు ఒకటి రెండు సినిమాలతో ప్రేక్షకులను అలరించి ఆతర్వాత మాయం అవుతుంటారు. చేసేది కొన్ని సినిమాలే కానీ ప్రేక్షకుల హృదయాల్లో మాత్రం స్థానం సంపాదించుకుంటుంటారు. కొంతమంది పెళ్లి చేసుకొని సెటిల్ అవుతుంటే.. మరికొంతమంది మాత్రం ఇతర బిజినస్ లతో బిజీగా మారుతున్నారు. అందం, అభినయంతో మెప్పించి జనాల మదిలో నిలిచిపోయిన హీరోయిన్లలో ఈముద్దుగుమ్మ ఒకరు. వేణు తొట్టెంపూడి హీరోగా నటించిన సినిమాల్లో చెప్పవే చిరుగాలి సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన భామల్లో పైన కనిపిస్తున్న హీరోయిన్ గుర్తుందా.?

ఆమె పేరు అషిమా భల్లా ఒకరు. ఈ పేరు చెబితే అంతగా గుర్తుపట్టరు.. కానీ చెప్పవే చిరుగాలి హీరోయిన్ నిర్మల అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు. ఈ పాత్రతో అంతగా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది ఈ అందాల భామ. 2001లో ఫ్యార్ జిందగీ హై అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. అదే ఏడాది మెగాస్టార్ చిరంజీవి నటించిన డాడీ సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యింది. ఇందులో సెకండ్ హీరోయిన్ గా కనిపించింది.

ఆషిమా భల్లా 1983, ఆగస్టు 3న చండీగఢ్ లో జన్మించింది. తల్లిపేరు నీలిమా భల్లా. ఆషిమా ఛండిగడ్ లోని ఆర్మీ హైస్కూలులో తన పాఠశాల విద్యను పూర్తిచేసింది. ఇక హీరోయిన్ గా మారిన తర్వాత ఈ అమ్మడు. తెలుగులోనే కాదు. తమిళ్, హిందీ సినిమాల్లో నటించి మెప్పించింది. ఈ సినిమా తర్వాత తెలుగులో చెప్పవే చిరుగాలి సినిమాతో మరోసారి అలరించింది. ఇందులో నిర్మల పాత్రలో ఆమె నటన మెప్పించింది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటుంది ఈ చిన్నది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి