Rajinikanth: రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు.. ఎవరో గుర్తుపట్టారా.?

|

Apr 26, 2024 | 7:09 PM

ఇటీవలే జైలర్ సినిమాతో సంచలన విజయం అందుకున్నారు సూపర్ స్టార్. చాలా కాలం తర్వాత భారీ హిట్ అందుకొని ఫుల్ జోష్ మీదన్నూరు సూపర్ స్టార్ ఈ జోష్ లోనే వరుసగా సినిమాలను లైనప్ చేశారు. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు రజినీకాంత్. ప్రస్తుతం వేటియన్ సినిమాలో నటిస్తున్నారురజిని, అలాగే లోకేష్ కానగరాజ్ తో కూలి సినిమాలు చేస్తున్నారు.

Rajinikanth: రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు.. ఎవరో గుర్తుపట్టారా.?
Rajinikanth
Follow us on

సూపర్ స్టార్ రజినీకాంత్ ఏడుపదుల వయసులోనూ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. యంగ్ హీరోలతో పోటీగా సినిమాలు రిలీజ్ చేస్తూ ఆకట్టుకుంటున్నారు. ఇటీవలే జైలర్ సినిమాతో సంచలన విజయం అందుకున్నారు సూపర్ స్టార్. చాలా కాలం తర్వాత భారీ హిట్ అందుకొని ఫుల్ జోష్ మీదన్నూరు సూపర్ స్టార్ ఈ జోష్ లోనే వరుసగా సినిమాలను లైనప్ చేశారు. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు రజినీకాంత్. ప్రస్తుతం వేటియన్ సినిమాలో నటిస్తున్నారురజిని, అలాగే లోకేష్ కానగరాజ్ తో కూలి సినిమాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే సూపర్ స్టార్ ఓల్డ్ ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పై ఫొటోలో సూపర్ స్టార్ తో ఉన్న కుర్రాడు ఎవరో గుర్తుపట్టారా.? ఆయన ఓ స్టార్ హీరో.. అమ్మాయిలా కలల రాకుమారుడు ఆ హీరో.. ఎవరో గుర్తుపట్టారా.?

రజినీకాంత్ ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించారు. ఎన్నో వైవిధ్యమైన సినిమాల్లో నటించి మెప్పించారు. రజినీకాంత్ చేయని సినిమాలేదు అంటే అతిశయోక్తి కాదేమో.. తమిళ్ లోనే కాదు తెలుగులోనూ పలు సినిమాల్లో నటించారు రజినీకాంత్. అలాగే చాలా మంది స్టార్ హీరోలు , హీరోయిన్స్ రజినీకాంత్ సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ లుగాను నటించారు. పై ఫొటోలో రజినీకాంత్ ను హత్తుకున్నా చిన్నోడు ఎవరో కాదు బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్.

రజనీకాంత్ నటించిన భగవాన్ దాదా చిత్రంలో హృతిక్ రోషన్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు. 1986లో ఈ సినిమా విడుదలైంది. అలాగే ఈ సినిమాలో అతిలోక సుందరి శ్రీదేవి హీరోయిన్ గా నటించారు. హృతిక్ తండ్రి రాకేష్ రోషన్ నిర్మించిన ఈ సినిమాలో రజనీకాంత్, శ్రీదేవితో పాటు పలువురు ప్రముఖ నటీనటులు నటించారు. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. హృతిక్ రోషన్ ప్రస్తుతం ఎన్టీఆర్ తో కలిసి వార్ 2 సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అలాగే రజినీకాంత్ నటిస్తున్న కూలి సినిమా టైటిల్ గ్లింప్స్ ఇటీవలే విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.