Tollywood: 15 ఏళ్లకే హీరోయిన్‏గా ఎంట్రీ.. 100కు పైగా సినిమాలు.. ఇంతకీ ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టగలరా ?..

తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీలో దాదాపు 100కు పైగా సినిమాల్లో నటించి మెప్పించింది. పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైన ఈ హీరోయిన్.. ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి కెనడాలో నివసిస్తుంది. ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో చురుకుగా ఉంటూ తన ఫ్యామిలీ ఫోటోస్, పిల్లల వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులకు టచ్ లో ఉంటుంది. ఆమెకు తెలుగులో ఎంతో ఫాలోయింగ్ ఉంది. మెగాస్టార్ చిరంజీవి, వెంకటేశ్, నాగార్జున వంటి స్టార్ హీరోలతో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది.

Tollywood: 15 ఏళ్లకే హీరోయిన్‏గా ఎంట్రీ.. 100కు పైగా సినిమాలు.. ఇంతకీ ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టగలరా ?..
Actress

Updated on: Feb 13, 2024 | 8:25 AM

చిన్న వయసులోనే కథానాయికగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీలో దాదాపు 100కు పైగా సినిమాల్లో నటించి మెప్పించింది. పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైన ఈ హీరోయిన్.. ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి కెనడాలో నివసిస్తుంది. ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో చురుకుగా ఉంటూ తన ఫ్యామిలీ ఫోటోస్, పిల్లల వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులకు టచ్ లో ఉంటుంది. ఆమెకు తెలుగులో ఎంతో ఫాలోయింగ్ ఉంది. మెగాస్టార్ చిరంజీవి, వెంకటేశ్, నాగార్జున వంటి స్టార్ హీరోలతో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇంతకీ ఆమె ఎవరో గుర్తుపట్టారా ?.. కెరీర్ ఆరంభంలోని ఫోటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. తమ అభిమాన తార అలనాటి ఫోటోస్ చూసి ఫ్యాన్స్ తెగ షేర్ చేస్తున్నారు. ఇంతకీ ఆ ఫోటోలో ఉన్న హీరోయిన్ ఎవరంటే.. సీనియర్ నటి రంభ.

1992లో సీనియర్ హీరో వినీత్ జోడిగా స్వర్గం సినిమాతో మలయాళం ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది రంభ. అప్పుడు ఆమె వయసు కేవలం 15 ఏళ్లు మాత్రమే. అదే ఏడాది సాంబకుళం దాచన్ చిత్రంలో నటింటింది. 1993లో ఇవివి సత్యనారాయణ తెరకెక్కించిన ఆ ఒక్కటీ అడక్కు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఇందులో రాజేంద్ర ప్రసాద్ హీరోగా నటించారు. తమిళంలో ఉఝవన్ సినిమాతో తెరంగేట్రం చేసింది. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది రంభ. మెగాస్టార్ చిరంజీవి సరసన బావగారూ బాగున్నారా, బొంబాయి ప్రియుడు, ముద్దుల ప్రియుడు, అల్లుడా మాజాకా, అల్లరి ప్రేమికుడు, చిన్నల్లుడు, చూసొద్దాం రండి చిత్రాల్లో నటించి మెప్పించింది. అంతేకాకుండా అనేక సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసి అలరించింది.

బాలకృష్ణ నటించి భైరవ ద్వీపం సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది అలాగే. శ్రీకృష్ణార్జున యుద్ధం, హలో బ్రదర్ సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసింది. చివరిసారిగా అల్లు అర్జున్, పూరీ జగన్నాథ్ కాంబోలో వచ్చిన దేశముదురు సినిమాలో స్పెషల్ సాంగ్ లో మెరిసింది రంభ. ఆమె చివరిసారిగా పెన్ సింగం సినిమాలో నటించింది. ఆ తర్వాత 2010లో కెనడాకు చెందిన వ్యాపారవేత్త ఇంద్రకుమార్ పద్మనాభన్ ను వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన ఆమె.. విదేశాల్లోనే స్థిరపడింది. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక బాబు ఉన్నాడు. 100కి పైగా సినిమాల్లో నటించిన ఆయన ఇప్పుడు సినిమా పరిశ్రమకు దూరమయ్యింది. ఇటీవలే భారత్ వచ్చిన ఆమె.. కెప్టెన్ విజయకాంత్ సమాధి వద్ద నివాళులర్పించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.