ఒకప్పుడు అమ్మాయిల డ్రీమ్ బాయ్.. ఇప్పుడు ఇలా గుర్తుపట్టలేనంతగా..

సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు తిరుగులేని హీరో.. ఎన్నో సూపర్ హిట్స్ అందుకున్నారు. అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ కు చాలా దగ్గరైన హీరో అయిన హీరోయిన్.. ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో మెప్పించారు ఆయన. పై ఫొటోలో కనిపిస్తున్న నటుడు ఎవరో గుర్తుపట్టారా.?

ఒకప్పుడు అమ్మాయిల డ్రీమ్ బాయ్.. ఇప్పుడు ఇలా గుర్తుపట్టలేనంతగా..
Tollywood News

Updated on: May 16, 2026 | 8:54 PM

సినిమాల కోసం నటులు ఎంత సాహసమైన చేస్తుంటారు. పాత్ర కోసం ఎంత రిస్క్ తీసుకోవడానికైనా సిద్దమవుతుంటారు. కొంతమంది హీరోలు సినిమాల్లో పాత్రకోసం భారీగా బరువు పెరగడం.. లేదా తగ్గడం వంటివి చేస్తుంటారు. అలాగే కొంతమంది చిత్రవిచిత్రమైన మేకప్ వేసుకుంటూ ఉంటారు. తాజాగా ఓ నటుడి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పై ఫొటోలో కనిపిస్తున్న నటుడిని గుర్తుపట్టారా.? ఆయన చాలా ఫేమస్ హీరో.. ఒకప్పుడు అమ్మాయిల డ్రీమ్ బాయ్. అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ ఉన్న హీరో ఆయన. ఎవరో గుర్తుపట్టారా.? గుర్తుపట్టడం పెద్ద కష్టమేమీ కాదు అనుకుంటా.. చాలా పాపులర్ నటుడు ఆయన.. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతున్నారు ఆయన. ఆయన మరెవరో కాదు..

ఇది కూడా చదవండి : మూడు పెళ్లిళ్లు చేసుకొని తప్పు చేశా.. టైం అంతా వేస్ట్.. ఇప్పుడు బుద్దొచ్చింది

పై ఫొటోలో కనిపిస్తున్న నటుడు ఎవరో కాదు.. ఒకప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ ను తన నటనతో కట్టిపడేసిన హీరో జగపతి బాబు. అప్పట్లో హీరోగా రాణించిన జగపతిబాబు.. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించారు. ముఖ్యంగా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ లో ఎక్కువగా నటించారు జగపతి బాబు. హీరోగా కెరీర్ లో ఉన్న స్థాయిని చూసిన జగపతిబాబు. ఇక ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి సహాయక పాత్రల్లో మెప్పిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి :RK Roja: ఒక్కహీరో కూడా నాకు లవ్ ప్రపోజ్ చేయలేదు.. కారణం ఏంటో చెప్పిన రోజా

ఒక వైపు విలన్ గా నటిస్తూనే మరో వైపు సహాయక పాత్రల్లో మెప్పిస్తున్నారు. కేవలం టాలీవుడ్ సినిమాలే కాదు తమిళ్ సినిమాలతో పాటు ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల్లోనూ మెప్పిస్తున్నారు జగపతి బాబు. ఇక పై ఫోటో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమాలోనిది. ఈ సినిమాలో జగపతిబాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. ఆయన లుక్ కూడా చాలా డిఫరెంట్ గా ఫ్లాన్ చేశారు దర్శకుడు బుచ్చిబాబు. పెద్ది సినిమాలో అప్పలసూరిగా కనిపించనున్నారు జగపతి బాబు.

ఇది కూడా చదవండి :భర్తను దర్శకుడిని చేద్దాం అనుకుంది.. కానీ బెడిసికొట్టింది.. సంపాదించిందంతా పోగొట్టుకొని చివరకు

జగపతిబాబు ఇన్ స్టా గ్రామ్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us