Chirujallu Movie: ఏంటీ అమ్మడు.. ఇది నువ్వేనా.. ? తరుణ్ చిరుజల్లు మూవీ హీరోయిన్‏ను ఇప్పుడు చూస్తే షాకే..

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ హిట్ లవ్ స్టోరీస్ చాలా ఉన్నాయి. ఒకప్పుడు తెలుగు సినీరంగంలో లవర్ బాయ్స్ గా క్రేజ్ సంపాదించుకున్న హీరోల గురించి చెప్పక్కర్లేదు. అందులో తరుణ్ ఒకరు. అప్పట్లో ఆయన సినిమాలకు విపరీతమైన క్రేజ్ ఉండేది. తరుణ్ నటించిన చిత్రాల్లో చిరుజల్లు ఒకటి. ఈ సినిమా మ్యూజిక్ పరంగానూ సూపర్ హిట్.

Chirujallu Movie: ఏంటీ అమ్మడు.. ఇది నువ్వేనా.. ? తరుణ్ చిరుజల్లు మూవీ హీరోయిన్‏ను ఇప్పుడు చూస్తే షాకే..
Heroine

Updated on: Jun 02, 2025 | 1:42 PM

తెలుగు సినిమా పరిశ్రమలో ఒకప్పుడు లవర్ బాయ్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న హీరోలలో తరుణ్ ఒకరు. ఎన్నో సూపర్ హిట్ ప్రేమకథలతో వెండితెరపై సందడి చేశారు. ముఖ్యంగా తరుణ్ నటించిన లవ్ స్టోరీ సినిమాలకు యూత్ లో విపరీతమైన క్రేజ్ ఉండేది. తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. తరుణ్ నటించిన చిత్రాల్లో చిరుజల్లు సినిమా ఒకటి. 2001 ఆగస్టు 17న విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. డైరెక్టర్ శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో తరుణ్ సరసన రిచా పల్లాడ్ కథానాయికగా నటించింది. ఈ మూవీలో దివంగత సింగర్ ఎస్పీ బాలు సైతం ముఖ్య పోషించారు. వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించిన ఈ సినిమాలోని సాంగ్స్ సైతం సూపర్ హిట్ అయ్యాయి.

ఇదిలా ఉంటే.. చిరుజల్లు చిత్రంలో కథానాయికగా నటించి అందం, సహజ నటనతో ప్రేక్షకులను కట్టిపడేసిన హీరోయిన్ రిచా పల్లాడ్. తెలుగులో ఈ బ్యూటీ చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ఈ సినిమా కంటే ముందే వీరిద్దరి కాంబోలో వచ్చిన చిత్రం నువ్వే కావాలి. ఆ సినిమా సైతం బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ రెండు చిత్రాలతో తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది.

ఆ తర్వాత హోలీ, నా మనసిస్తారా, పెళ్లాం పిచ్చోడు వంటి చిత్రాల్లో నటించింది. కానీ మొదటి రెండు సినిమాలకు వచ్చిన సక్సెస్ మాత్రం రాలేదు. దీంతో తెలుగులో రిచాకు అవకాశాలు రాలేదు. 2016 తర్వాత ఇండస్ట్రీకి పూర్తిగా దూరమయ్యింది. 2011లో హిమాన్షు బజాజ్ అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుంది. వీరికి బాబు ఉన్నారు. కొంత కాలం సినిమాలకు దూరంగా ఉన్న రిచా.. 2018లో ఖాన్ నెంబర్ 1 అనే సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం బుల్లితెరపై సీరియల్స్, ఓటీటీలో వెబ్ సిరీస్ చేస్తుంది. అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోస్ చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్.

ఇవి కూడా చదవండి :  

OTT Movie: ఓటీటీలో తెగ ట్రెండ్ అవుతోన్న క్రైమ్ సస్పెన్స్.. ఊహించని మలుపులు.. క్షణ క్షణం ఉత్కంఠ..

Nagarjuna: టాలీవుడ్‏ని ఏలేసిన హీరోయిన్.. కానీ నాగార్జునతో ఒక్క సినిమా చేయలేదు.. ఎందుకంటే..

Tollywood: ఇండస్ట్రీలో తోపు నటుడు.. కోట్లు వదిలి పల్లెటూరి జీవితాన్ని గడుపుతున్న హీరో.. కారణం ఇదే..

OTT Movie: ఇదెందీ మావ.. థియేటర్లలో డిజాస్టర్.. ఓటీటీని ఊపేస్తోంది.. దేశంలోనే టాప్ ట్రెండింగ్..