
తెలుగు సినీ పరిశ్రమలో చాలా మంది హీరోయిన్స్ తమకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. చేసింది తక్కువ సినిమాలే అయిన.. తమ సహజ నటనతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఒకట్రెండు చిత్రాలతో ఇండస్ట్రీలో స్టార్ డమ్ అందుకున్నారు. కానీ ఆ తర్వాత వీరికి తెలుగులో అంతగా అవకాశాలు మాత్రం రాలేదు. దీంతో పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి ఫుల్ బిజీ అవుతున్నారు. అందులో ఈ హీరోయిన్ ఒకరు. పైన ఫోటోను చూశారు కదా.. ఆ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా ?.. తెలుగులో స్టార్ హీరోల జోడిగా నటించి మెప్పించింది. పవర్ స్టార్ సినిమాతో ఈ బ్యూటీకి తెలుగులో మంచి క్రేజ్ వచ్చేసింది. ఆ తర్వాత రెండు మూడు సినిమాలు చేసి ఇండస్ట్రీకి దూరమయ్యింది. ఇంతకీ తను ఎవరంటే.. హీరోయిన్ ప్రీతి జింగానీయ. ఈ పేరు చెబితే గుర్తుపట్టడం కష్టమే.. కానీ తమ్ముడు మూవీ హీరోయిన్ అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు.
ప్రీతి జింగానీయ.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన తమ్ముడు సినిమాలో నటించింది. అప్పట్లో ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. ఇందులో ఆమె అద్భుతంగా నటించి మెప్పించింది. దీంతో ఈ బ్యూటీకి మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత బాలకృష్ణ నటించిన నరసింహనాయుడు మూవీలో కనిపించింది. ఈ మూవీ సూపర్ హిట్ అయ్యింది. కానీ తెలుగులో ఆ తర్వాత సరిగ్గా అవకాశాలు మాత్రం రాలేదు. దీంతో బాలీవుడ్ ఇండస్ట్రీకి షిఫ్ట్ అయ్యింది. అక్కడ ఒకట్రెండు సినిమాల్లో నటించి అలరించింది. ఆ తర్వాత తెలుగులో తేజం అనే సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది.
2007లో విక్టోరియా నెం.203 సినిమా తర్వాత మరో హిందీ సినిమాలో కనిపించలేదు. సినిమాలకు దూరంగా ఉన్న ఈ భామ. ఇటీవలే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. గతేడాది ఫాస్ వెబ్ సిరీస్ తో రీఎంట్రీ ఇచ్చింది. సోషల్ మీడియాలో ఎప్పుడు చురుకుగా ఉండే ఈ బ్యూటీ.. తన ఫ్యామిలీ విషయాలను పంచుకుంటుంది. తన కుటుంబంతో కలిసి ఉన్న ఫోటోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తుంటుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.