
సినీ పరిశ్రమలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి ఫుల్ ఫేమస్ అయిన నటీనటులు చాలా మంది ఉన్నారు. చిన్నతనంలో బాలనటీనటులుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. హీరోహీరోయిన్లుగా రాణిస్తున్నారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో యాడ్స్ చేసిన కృతి శెట్టి ప్రస్తుతం కథానాయికగా రాణిస్తోంది. ఇక ఇప్పుడు మరో బాలనటిగా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యింది. సిమ్రాన్ నటేకర్ ఈ పేరు చెబితే గుర్తుపట్టడం కష్టమే. కానీ ఈ నగరానికి ఏమైంది యాడ్ చిన్నారి అంటే సినీప్రియులు ఠక్కున గుర్తుపట్టేస్తారు. ముఖ్యంగా థియేటర్లలో రెగ్యూలర్ గా మూవీస్ చూసేవారికి ఈ చిన్నారి సుపరిచితమే. సినిమా స్టార్టింగ్ ముందు వచ్చే ధూమాపానం యాడ్ ద్వారా ఈ చిన్నారి ఫేమస్ అయ్యింది. సినిమా స్ట్రీమింగ్ ముందు ఈ నగరానికి ఏమైంది.. ఓ వైపు పొగ.. మరోవైపు నుసి.. ఎవ్వరూ నోరు మెదపరేంటీ అంటూ ఒక యాడ్ వస్తుంది. ఇందులో ఓ చిన్నారి తన తండ్రి వద్దకు రాగానే సిగరెట్ తాగుతున్న అతను వెంటనే సిగరెట్ పడేస్తాడు.
ఈ యాడ్ లో అమాయకపు చూపులతో తెగ పాపులారిటీని సంపాదించుకుంది ఆ చిన్నారి. ఇక ఇప్పుడు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యింది. 1997లో ముంబైలో జన్మించిన సిమ్రాన్.. చిన్నవయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ధూమాపానం యాడ్ కాకుండా.. దాదాపు 150కి పైగా యాడ్స్ చేసింది. ఆ తర్వాత బుల్లితెరపై ప్రభంజనం సృష్టించిన చిన్నారి పెళ్లి కూతురు సీరియల్లో పూజా పాత్రలో కనిపించింది. ఆ తర్వాత హిందీలో పలు సినిమాలు చేసి అలరించింది.
అయితే ఇప్పటివరకు సిమ్రాన్ చిన్న చిన్న పాత్రలలోనే అలరించింది. కానీ ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టిందట సిమ్రాన్. తెలుగులో సినిమా చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే టాలీవుడ్ యంగ్ డైరెక్టర్లతో పలు అడిషన్స్ ప్లాన్ చేసిందని టాక్ వినిపిస్తోంది. త్వరలోనే తెలుగు సినిమాతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యిందట సిమ్రాన్. ప్రస్తుతం ఈ బ్యూటీకి సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.