ఫాంటసీ సినిమాలు ఇప్పటికంటే ఒకప్పుడు ప్రేక్షకులను తెగ ఆకట్టుకున్నాయి. అప్పట్లో ఎన్నో వైవిధ్యమైన సినిమాలు తెరకెక్కి ప్రేక్షకులను మెప్పించాయి. భారీ వీఎఫ్ఎక్స్ లాంటివి లేని రోజుల్లోనే అప్పటి గ్రాఫిక్స్ ను ఉపయోగించి ఎన్నో సినిమాలు తెరకెక్కాయి. అలాంటి ఫాంటసీ మూవీస్ లో దేవి సినిమా ఒకటి. గ్రాఫిక్స్ ఉపయోగించి సినిమాలు తెరకెక్కించడంలో దివంగత దర్శకుడు కోడిరామకృష్ణ దిట్ట.. ఎన్నో సూపర్ హిట్ సినిమాలను ప్రేక్షకులకు అందించారు కోడి రామకృష్ణ. ఇక దేవి సినిమా సినిమా విషయానికొస్తే ఒక నాగు పాము కథతో ఈ సినిమాను రూపొందించారు. నాగ్ లోకం నుంచి భూలోకానికి వచ్చిన ఓ పాము మానవ రూపంలోకి మారడం.. ఒకరిని ప్రేమించడం పెళ్లాడటం, ఈ క్రమంలో విలన్ ను ఎదుర్కోవడం అనే కథతో అద్భుతంగా తెరకెక్కించారు కోడి రామకృష్ణ. ఈ సినిమాతోనే రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా పరిచయం అయ్యారు.
ఇక ఈ సినిమాలో నటించిన అందరికి మంచి పేరు వచ్చింది. ముఖ్యంగా హీరోయిన్ ప్రేమ ఈ సినిమా తర్వాత చాలా పాపులర్ అయ్యింది. అలాగే ఈ సినిమాలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తున్నాడా..? దేవి మూవీలో విలన్ ఓ బాలుడి రూపంలోకి మారి హీరో ఫ్యామిలీని చంపాలని చూస్తాడు. ఆ బాలుడి పాత్రలో నటించింది ఎవరో తెలుసా.? అతను ఇప్పుడు ఎలా ఉన్నడో తెలుసా.? ఆ చిచ్చర పిగుడు ఇప్పుడు హీరోగా మారిపోయాడు.
ఆ చిన్నారి పేరు మాస్టర్ మహేంద్రన్. మహేంద్రన్ చాలా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించాడు. తెలుగుతో పాటు తమిళ్ లోనూ సినిమాలు చేశాడు. పెళ్లి చేసుకుందాం, ఆహా, దేవి, లిటిల్ హార్ట్స్, నీ స్నేహం, వంటి చిత్రాల్లో నటించాడు. అంతే కాదు ఈ సినిమాల్లో దేవి, లిటిల్ హార్ట్స్ సినిమాలకు గాను బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా అవార్డులు కూడా అందుకున్నాడు. ఈ చిన్నడు ఇప్పుడు హీరోగా మారిపోయాడు. మొన్నామధ్య తమిళ్ లో ఓ సినిమా కూడా చేశాడు. దళపతి విజయ్ హీరోగా నటించిన మాస్టర్ సినిమాలో యంగ్ విజయ్ సేతుపతి గా కనిపించాడు. ఈ కుర్రాడు ఇంతవరకు తెలుగులోకి అడుగుపెట్టలేదు. కానీ తమిళ్ లో సినిమా చేశాడు. ఇప్పుడు ఈ యంగ్ హీరో ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.