Raghuvaran : ఈ నటుడి భార్య తెలుగులో స్టార్ నటి.. అగ్ర హీరోలకు జోడిగా నటించి.. ఇప్పుడు..

సౌత్ ఇండస్ట్రీలో ఒకప్పుడు విలనిజంకు కొత్త లుక్ తీసుకువచ్చిన నటుడు రఘువరన్. విలన్ అంటే ఎప్పుడూ లుంగీ, రఫ్ లుక్, పెద్ద జుట్టు, గడ్డంతో ఎంతో భయకరంగా కనిపించేవారు. కానీ ఆ తర్వాత స్టైలీష్ లుక్ విలన్‏గా వెండితెరపై తన నటనతో మాయ చేసిన నటుడు రఘువరన్. తెలుగు, తమిళం, మలయాళం భాషలలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు.

Raghuvaran : ఈ నటుడి భార్య తెలుగులో స్టార్ నటి.. అగ్ర హీరోలకు జోడిగా నటించి.. ఇప్పుడు..
Rohini

Updated on: Jul 17, 2025 | 5:32 PM

రఘువరన్.. ఈ తరం ప్రేక్షకులకు అంతగా తెలియకపోవచ్చు. కానీ ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో తోపు యాక్టర్. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించి సినీరంగంలో తనదైన ముద్ర వేశారు. అనేక విభిన్న పాత్రలకు తన నటనతో ప్రాణం పోశారు. తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. విలన్ క్యారెక్టర్‍తో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. సినిమాల్లో రఘువరన్ ఎక్కువగా కనిపించింది విలన్ పాత్రలతోనే. ఆయన స్క్రీన్ పై కనిపిస్తే చాలు.. హుందాతనం.. విలన్ క్యారెక్టర్ అంటే ఇలా ఉండాలి అనిపిస్తుంది. ఇక ఆయన చెప్పే డైలాగ్స్ గురించి చెప్పక్కర్లేదు. మెగాస్టార్ చిరంజీవి నటించిన ప్రాణం ఖరీదు సినిమాతో సినీప్రయాణం స్టార్ట్ చేశారు.

తెలుగులో జేబుదొంగ, రుద్రవీణ, లంకేశ్వరుడు, సుస్వాగతం, ఒకే ఒక్కడు, భాష వంటి అనేక చిత్రాల్లో నటించి మెప్పించారు. విలన్ పాత్రలతోపాటు స్టార్ హీరోలకు తండ్రిగా, స్నేహితుడిగానూ కనిపించారు. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన శివ సినిమాతో తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఈ చిత్రంలో భవాని పాత్రతో తెలుగు జనాలకు దగరయ్యారు. సౌత్ ఇండస్ట్రీలో బ్యాక్ టూ బ్యాక్ సినిమాల్లో నటించారు. కానీ కెరీర్ మంచి ఫాంలో ఉండగానే అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. కానీ ఇప్పటికీ ఆయన పాత్రలు అడియన్స్ హృదయాల్లో నిలిచిపోయాయి.

ఇవి కూడా చదవండి

ఇవి కూడా చదవండి : బాబోయ్.. ఈ ఆసనాలేంటమ్మా.. తలకిందులుగా వేలాడుతున్న హీరోయిన్.. ఒకప్పుడు తెలుగులో తోపు..

Raghuvaran

ఇదిలా ఉంటే.. రఘువరన్ భార్య సైతం తెలుగులో స్టార్ యాక్టర్ అని మీకు తెలుసా.. ? ఆమె మరెవరో కాదు.. రోహిణి. చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ స్టార్ట్ చేసిన రోహిణి.. ఆ తర్వాత తెలుగు, తమిళంలో హీరోయిన్ గా కనిపించింది. ఇక ఇప్పుడు ఆమె స్టార్ హీరోలకు తల్లిగా నటిస్తుంది. పెళ్లి తర్వాత చాలా కాలం సినిమాలకు దూరమైన ఆమె.. అలా మొదలైంది చిత్రంతో రీఎంట్రీ ఇచ్చింది. ఇందులో న్యాచురల్ స్టార్ నానికి తల్లిగా అద్భుతమైన నటనతో కట్టిపడేసింది. ఆ తర్వాత తెలుగులో అనేక చిత్రాల్లో నటించింది. దాదాపు 40కి పైగా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా నటించింది. 1995లో స్త్రీ అనే సినిమాకు నేషనల్ ఫిల్మ్ అవార్డ్ అందుకుంది. ప్రస్తుతం దక్షిణాది సహయ నటిగా రాణిస్తుంది. రఘువరన, రోహిణిలు 1996లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి బాబు ఉన్నాడు. కానీ వీరిద్దరు 2004లో విడాకులు తీసుకున్నారు.

ఇవి కూడా చదవండి :

బాబోయ్.. ఈ ఆసనాలేంటమ్మా.. తలకిందులుగా వేలాడుతున్న హీరోయిన్.. ఒకప్పుడు తెలుగులో తోపు..

Shilpa Shetty : శిల్పా శెట్టి చెల్లెలు తెలుగులో తోపు హీరోయిన్.. ఒక్క సినిమాతోనే కుర్రాళ్లకు కునుకు లేకుండా చేసింది.. ఎవరంటే..

Telugu Actress : వరుసగా ప్లాపులు.. అయినా తగ్గని క్రేజ్.. రెమ్యునరేషన్ డబుల్ చేసిన హీరోయిన్..

Cinema : హిస్టరీలోనే అతిపెద్ద అట్టర్ ప్లాప్ సినిమా.. రూ.45 కోట్లతో తీస్తే.. రూ.60 వేలు రాలేదు.. దెబ్బకు..