స్కూల్ డ్రస్‌లో ఉన్న ఈ క్యూటీని గుర్తుపట్టారా.? కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్ ఈ చిన్నది

|

Dec 30, 2024 | 1:56 PM

టాలీవుడ్​ ఎప్పుడూ కొత్తదనాన్ని కోరుకుంటుంది. అది కంటెంట్ విషయంలో కావొచ్చు.. ఆర్టిస్టుల విషయంలో కావొచ్చు. అందం, అభినయం ఉన్న అమ్మాయిలను మనవాళ్లు ఎప్పుడూ ఆదరిస్తునే ఉంటారు. అలా ఎంతో మంది ముద్దుగుమ్మలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటుంటారు. అన్నీ కలిసిస్తే దశాబ్ధాల పాటు వారికి అవకాశాలు వెల్లువలా వస్తాయి

స్కూల్ డ్రస్‌లో ఉన్న ఈ క్యూటీని గుర్తుపట్టారా.? కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్ ఈ చిన్నది
Tollywood
Follow us on

హీరోయిన్స్ కు సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. అభిమానులు హీరోయిన్స్ ఫోటోలను తెగ షేర్ చేస్తూ ఉంటారు. అలాగే ఇప్పుడు ఓ చిన్నదాని ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది. పై ఫొటోలో క్యూట్‌గా కనిపిస్తోన్న అమ్మాయిని గుర్తుపట్టారా.? చూడగానే ప్రేక్షకులు ప్రేమలో పడిపోయే అందగత్తె ఆమె.. ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం దక్షిణాది సినీ ఇండస్ట్రీలో ఫేమస్‌ హీరోయిన్‌. సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో తమకుండే గ్లామర్‌తో కొంతమంది క్లిక్‌ అవుతారు. మరికొంతమంది తమ యాక్టింగ్‌ ట్యాలెంట్‌తో ఆకట్టుకుంటారు. కానీ కొంతమంది భామలే అందం, అభినయంతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. అలాంటి వారిలో ఈ చిన్నది ఒకరు.  బాలనటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆతర్వాతి కాలంలో కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది. ఇంతకూ ఈ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టారా.?

మలయాళంలో ఎక్కువగా సినిమాలు చేసినా.. టాలీవుడ్‌లోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. నాని, ఎన్టీఆర్‌, పవన్‌ కల్యాణ్‌, రజనీకాంత్‌ వంటి స్టార్‌ హీరోల సినిమాల్లో నటించింది. కుర్రాళ్లలో చాలామందికి ఈ ముద్దుగుమ్మ అంటే క్రేష్‌. మరి ఈ బ్యూటీ క్వీన్ ఎవరో గుర్తుపట్టారా.?  ఆమె మరెవరో కాదు.. మలయాళ కుట్టీ నివేదా థామస్‌.

నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన  జెంటిల్ మేన్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది. అలాగే మలయాళం, తమిళ, తెలుగు సినిమాల్లో నటించింది ఈ చిన్నది. ఆతర్వాత మరోసారి నానితోనే నటించింది. నాని నటించిన నిన్ను కోరి సినిమాలో చేసింది. ఈ రెండు సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. ఆతర్వాత ఎన్టీఆర్ నటించిన జై లవకుశ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా చేసి మెప్పించింది. జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్ సినిమా చేసింది. కానీ ఆ సినిమా నిరాశపరిచింది. ఆతర్వాత తెలుగులో వరుసగా సినిమాలు చేసి మెప్పించింది. ఇక 2024లో 35 చిన్న కథ కాదు సినిమాతో మెప్పించింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.