హోటల్లో పని చేశాడు.. సినిమాల్లోకి వచ్చాక పేరు మార్చుకున్నాడు.. కట్ చేస్తే రూ. 2000వేల కోట్లకు అధిపతి
ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలోని టాప్ హీరోలలో అతడు ఒకరు. 1967లో పాత ఢిల్లీలో జన్మించాడు. రాజీవ్ హరి ఓం భాటియా ఈపేరు జనాలకు అస్సలు తెలియదు. కానీ అతడికి విపరీతమైన క్రేజ్ ఉంది. సూపర్ స్టార్ కావడానికి చాలా కాలం ముందు, అతను బ్యాంకాక్‌కు వెళ్లాడు.

సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదగడం అంత సులభమైన విషయం కాదు. అందులోనూ ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ.. మార్షల్ ఆర్ట్స్ నేర్పిస్తూ.. మోడలింగ్ నుంచి సినిమాల్లోకి వచ్చిన వ్యక్తి ఈరోజు కోట్లాది రూపాయల ఆస్తులకు అధిపతిగా ఎదిగాడంటే అది నిజంగా ఆసక్తికరమైన ప్రయాణమే. ఆ వ్యక్తి మరెవరో కాదు.. బాలీవుడ్ ‘ఖిలాడీ’ అక్షయ్ కుమార్. అక్షయ్ కుమార్ అసలు పేరు రాజీవ్ హరి ఓం భాటియా. 1967 సెప్టెంబర్ 9న జన్మించిన ఆయన చిన్ననాటి రోజులను ఢిల్లీ చాందినీ చౌక్ ప్రాంతంలో గడిపారు. చిన్నప్పటి నుంచే క్రీడలు, మార్షల్ ఆర్ట్స్‌పై ఆసక్తి ఉన్న అక్షయ్.. తైక్వాండోలో బ్లాక్ బెల్ట్ సాధించారు. ఆ తర్వాత మరింతగా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలనే ఉద్దేశంతో థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌కు వెళ్లారు.
ఆ హీరోతో నటించడం నాకు ఇష్టం లేదు.. అందుకే ఒక్క సినిమాకూడా చేయలేదు..
ఈరోజు కోట్లాది రూపాయల పారితోషికం తీసుకునే స్టార్ హీరో అప్పట్లో జీవనం సాగించేందుకు బ్యాంకాక్‌లో చెఫ్, వెయిటర్‌గా కూడా పనిచేశారు. అక్కడే ముయే థాయ్ వంటి మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ పొందారు. థాయ్‌లాండ్‌లో గడిపిన కాలం ఆయన వ్యక్తిత్వాన్ని, క్రమశిక్షణను ఎంతగానో ప్రభావితం చేసింది. థాయ్‌లాండ్ నుంచి భారత్‌కు తిరిగి వచ్చిన తర్వాత కూడా ఆయన జీవితం వెంటనే మారిపోలేదు. ముంబైలో మార్షల్ ఆర్ట్స్ నేర్పిస్తూ తన కెరీర్‌ను కొనసాగించారు. అదే సమయంలో మోడలింగ్‌లోకి అడుగుపెట్టే అవకాశం వచ్చింది. అక్షయ్ కుమార్ తొలి విడుదలైన చిత్రం సౌగంధ్. ఆ తర్వాత 1992లో వచ్చిన దీదార్ సహా వరుస సినిమాల్లో నటించారు. అయితే ఆయనకు నిజమైన యాక్షన్ హీరో ఇమేజ్‌ను బలంగా తీసుకొచ్చిన సినిమాల్లో ‘ఖిలాడీ’ (1992) కీలకంగా నిలిచింది. ఆ తర్వాత ‘ఖిలాడీ’ సిరీస్‌తో ఆయనకు ప్రత్యేకమైన మాస్ ఇమేజ్ ఏర్పడింది.
అక్క తోప్ హీరోయిన్ చెల్లి మాత్రం సినిమాలు మానేసి ఇప్పుడు ఇలా.. ఆమె ఎవరో తెలుసా.?
యాక్షన్ సినిమాలతో పాటు కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లు, సోషల్ మెసేజ్ ఉన్న చిత్రాలు, డ్రామా వంటి విభిన్న జానర్లలో నటిస్తూ తన కెరీర్‌ను విస్తరించుకున్నారు. మూడు దశాబ్దాలకు పైగా కొనసాగుతున్న అక్షయ్ కుమార్ కెరీర్‌లో 150కి పైగా సినిమాలు ఉన్నాయి. అక్షయ్ కుమార్ సంపాదన, ఆస్తుల గురించి తరచూ బాలీవుడ్‌లో చర్చ జరుగుతూనే ఉంటుంది. ఇటీవలి నివేదికల్లో ఆయన నికర ఆస్తుల విలువను సుమారు రూ.2,500 కోట్లుగా అంచనా వేశారు. అలాగే ఒక్కో సినిమాకు ఆయన తీసుకునే పారితోషికం ప్రాజెక్టును బట్టి రూ.60 కోట్ల నుంచి రూ.145 కోట్ల వరకు ఉంటుందని కొన్ని నివేదికలు తెలిపాయి. 2026లో అక్షయ్ కుమార్ నికర ఆస్తులను సుమారు రూ.2,700 కోట్లుగా కొన్ని నివేదికలు పేర్కొన్నాయి. కాబట్టి రూ.2,500 నుంచి 2,700 కోట్ల వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
ఆ హీరోయిన్‌తో నాకు గట్టిపోటీ ఉండేది.. ఇద్దరం తగ్గేవాళ్లం కాదు..! మీనా సెన్సేషనల్ కామెంట్స్
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




